బాలయ్య ‘భానుమతి గారి మొగుడు’ గురించి ఆసక్తికర విషయాలు..!

  • November 19, 2022 / 05:51 PM IST

నందమూరి బాలకృష్ణ కెరీర్ స్టార్టింగ్‌‌లో, సోలో హీరోగా నిలదొక్కుకునే ప్రయత్నంలో, కుటుంబ కథాచిత్రాలతో పాటు మాస్ ప్రేక్షకులు కోరుకునే కమర్షియల్ ఎలిమెంట్స్ ఉండే సినిమాలు చేయడానికి ఎక్కువ ఆసక్తి చూపించేవాడు. ముఖ్యంగా 1980, 90ల కాలంలో వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉండేవాడు. బాలయ్యతో ఫ్యామిలీ నేపథ్యంలో సాగే వినోదాత్మక చిత్రం చేయాలని నిర్మాత డి.వి.యస్.రాజు అనుకున్నారు. విజయ్ కాంత్, రాధిక జంటగా.. పి.కళైమణి దర్శకత్వంలో తెరకెక్కి విజయం సాధించిన ‘తెర్కతి కల్లన్’ అనే తమిళ చిత్రాన్ని తెలుగులో బాలయ్య, విజయ శాంతి నాయకా నాయికలుగా..

డీవీఎస్ ఎంటర్‌ప్రైజెస్ బ్యానర్ మీద నరసరాజు నిర్మాణంలో వచ్చిన సినిమా .. ‘భానుమతి గారి మొగుడు’..ఎ.కోదండ రామి రెడ్డి దర్శకుడు. 1987 నవంబర్ 19న విడుదలైన ఈ యాక్షన్ కామెడీ అండ్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ 2022 నవంబర్ 19 నాటికి 35 సంవత్సరాలు పూర్తి చేసుకుంటోంది. మొదటి ఆట మొదలు ప్రేక్షకాభిమానుల నుండి పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. ముఖ్యంగా భార్యభర్తల బంధం నేపథ్యంలో వచ్చే సన్నివేశాలు ఫ్యామిలీ ఆడియన్స్‌ని బాగా ఆకట్టుకున్నాయి..

బాలయ్య, విజయ శాంతిల జోడీ, క్యారెక్టర్లు, డైలాగులు, పాటలు, నేపథ్య సంగీతం..ఇలా ప్రతీది ఈ సినిమాకు ప్లస్ అయ్యాయి.. పరుచూరి బ్రదర్స్ తెలుగు నేటివిటీకి తగ్గట్టు కథలో మార్పులు చేశారు. అశ్విని, రంగనాథ్, విజయ నిర్మల, గిరిబాబు తదితరులు కీలకపాత్రల్లో నటించారు. చక్రవర్తి కంపోజ్ చేసిన పాటలు ప్రేక్షకాదరణ పొందాయి.. బాలయ్య సోదరుడు నందమూరి మోహన కృష్ణ ఈ సినిమాకి కెమెరా మెన్.. ఈ శతదినోత్సవ వినోదాత్మక చిత్రం మంచి వసూళ్లు రాబట్టింది.

బాలయ్యను ఫ్యామిలీ ఆడియన్స్‌కి మరింత దగ్గర చేసింది. కామెడీ టైమింగ్, డ్యాన్సుల్లో సరికొత్తగా కనిపించాడు బాలయ్య. ‘భానుమతి గారి మొగుడు’ అనే టైటిల్‌కి మహిళా ప్రేక్షకులంతా కనెక్ట్ అవడం పెద్ద ప్లస్ అయింది. దాంతో, బాలయ్య, విజయ శాంతి, కోదండ రామి రెడ్డి కాంబినేషన్‌లో సూపర్ హిట్ ఫిలింగా నిలిచింది.

ఆహ నా పెళ్లంట వెబ్ సిరీస్ రివ్యూ& రేటింగ్!
గాలోడు సినిమా రివ్యూ & రేటింగ్!

మసూద సినిమా రివ్యూ & రేటింగ్!
సూపర్ స్టార్ కృష్ణ ట్రెండ్ సెట్టర్ అనడానికి 10 కారణాలు!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus