ఇండిపెండెన్స్ డే కానుకగా ‘అగధ’(Agadha) రిలీజ్ అయ్యింది. సీనియర్ స్టార్ నిర్మాత ఎం.ఎస్.రాజు దర్శకత్వం వహించిన సస్పెన్స్,హర్రర్ అండ్ సూపర్ నేచురల్ థ్రిల్లర్ మూవీ ఇది. ప్రీమియర్స్ తోనే ‘అగధ’ కి మంచి రిపోర్ట్స్ వచ్చాయి. ఇందులో హీరో శ్రవణ్ రెడ్డి పాత్ర ఓ సర్ప్రైజింగ్ ప్యాకేజ్ గా నిలిచింది. మొదట్లో చాలా సహజంగా కనిపించే ఈ పాత్రతో పెద్ద ట్విస్ట్ ఉంటుంది. కథను మలుపు తిప్పేది కూడా ఈ పాత్రే. ఎంతో ఛాలెంజ్ తో నిండి ఉండే ఈ పాత్రని శ్రవణ్ ఎంతో ఈజ్ తో చేసేశాడు.
ఇతని పెర్ఫార్మెన్స్ సినిమాకి స్పెషల్ అట్రాక్షన్ అయ్యింది. ఇతను కనిపించే ప్రతి సన్నివేశంలో ఆడియన్స్ భయపడతారు. నిశ్శబ్దంగా ఉన్నా సరే థియేటర్లలో జనాలు అరుస్తూ… బాగా సెలబ్రేట్ చేసుకున్నారు. సినిమా మొత్తం పూర్తయ్యాక థియేటర్ నుండీ బయటకు వచ్చే ప్రతి ప్రేక్షకుడు ఈ పాత్ర గురించి ప్రత్యేకంగా మాట్లాడుకుంటారు అనడంలో సందేహం లేదు. ఈ సినిమాతో కచ్చితంగా శ్రవణ్ రెడ్డి పేరు మరింతగా మార్మోగడం ఖాయం అనే చెప్పాలి.
‘అగాధ’ రెగ్యులర్‌గా వచ్చి వెళ్లిపోయే సినిమాలకు, ముఖ్యంగా హారర్ జానర్‌లో మనం చూసే చిత్రాలకు చాలా భిన్నమైన సినిమా. నిజానికి దీన్ని కేవలం ‘హారర్ సినిమా’ అని పిలవడం కూడా రెగ్యులర్ అనిపిస్తుంది. మిస్టిసిజం, సూపర్‌నేచురల్ అంశాలతో అల్లుకున్న ఒక atmospheric thriller అని కూడా ప్రత్యేకంగా చెప్పుకోవాలి. శ్రవణ్ తో పాటు నటీనటుల అద్భుతమైన పెర్ఫార్మెన్సెస్ సినిమాను మరో స్థాయికి తీసుకెళ్తాయి.