‘సరిలేరు నీకెవ్వరు’ రమణ గురించి ఆసక్తికరమైన విషయాలు..!

ప్రస్తుతం ఉన్న రోజుల్లో .. ఎవరు ఎలా ఫేమస్ అవుతారో .. ఎవ్వరూ ఊహించలేకపోతున్నారు. సోషల్ మీడియా పెరిగిన తర్వాత.. ఉప్పల్ బాల్ వంటి వారు రాత్రికి రాత్రే ఫేమస్ అయిపోతున్నారు. అందుకు కారణం సోషల్ మీడియా అనే చెప్పాలి. ఎన్నో ఏళ్ళ నుండీ ఇండస్ట్రీలో ఉంటున్న వారికి.. అలాగే సినిమాల్లో నటించే వారికి రాని ఫాలోయింగ్ సోషల్ మీడియా వల్ల వస్తుంది అనడంలో అతిశయోక్తి లేదు. ఇదిలా ఉంటే.. సంక్రాంతికి విడుదలైన మహేష్ బాబు ‘సరిలేరు నీకెవ్వరు’ చిత్రంలో ‘రమణా లోడెత్తాలిరా చెక్ పోస్ట్ పడతాది’ డైలాగ్ చాలా ఫేమస్ అయ్యింది. ఈ డైలాగ్ తో ‘టిక్ టాక్’ లు చేస్తూ తెగవైరల్ అవుతున్నారు కొందరు నెటిజన్లు.

అయితే ఈ డైలాగ్ చెప్పిన వ్యక్తి 20 ఏళ్ల నుండీ ఇండస్ట్రీ లో ఉన్నాడు.’అరవింద2′ ‘అల్లుడు శీను’ ‘స్టాలిన్’ ‘సైరా’ వంటి ఎన్నో చిత్రాల్లో నటించినా రాని గుర్తింపు ‘సరిలేరు నీకెవ్వరు’ చిత్రంతో వచ్చిందట. ఇక ఈ రమణ అసలు పేరు కుమనన్ సేతురామన్. ఈయన ఒక స్టిల్ ఫొటోగ్రాఫర్. ఈయన 20 ఏళ్ల నుండీ ఇండస్ట్రీలో ఉన్నారట. ఈయన మెగాస్టార్ చిరంజీవి స్థాపించిన ‘ప్రజారాజ్యం’ పార్టీ చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ గా కూడా పనిచేసాడట. ఆ అనుబంధంతోనే చిరు ‘స్టాలిన్’ ‘సైరా’ చిత్రాల్లో అవకాశం ఇచ్చారట. అయితే అన్ని చిత్రాలు చేసినా రాని గుర్తింపు ‘సరిలేరు నీకెవ్వరు’ చిత్రంలో ఒక్క డైలాగ్ తో వచ్చినందుకు కుమనన్ సేతురామన్ ఆనందం వ్యక్తం చేస్తున్నాడు. ఆ ఫైట్ సీక్వెన్స్ లో తన కాలికి గాయమైతే స్వయంగా మహేష్ బాబు.. కుమనన్ కు ధైర్యం చెప్పడమే కాకుండా.. ‘అపోలో హాస్పిటల్ లో తనకి తెలిసిన వాళ్ళతో వైద్యం చేయించి’ సహాయం చేసాడట మహేష్. ఈ సందర్భంలో ఆయనకి కృతజ్ఞతలు తెలిపాడు కుమనన్. ఇక 60 ఏళ్ల ఈ పెద్దాయన ఇప్పటికీ రోజూ జిమ్ లో కసరత్తులు చేస్తూ దిట్టంగా ఉండడం విశేషం.

1

2

3

4

5

6

7

8

9

10

11

12

13

14

15

16

17

18

19

20

21

22

23

24

25

26

సరిలేరు నీకెవ్వరు సినిమా రివ్యూ & రేటింగ్!
అల వైకుంఠపురములో సినిమా రివ్యూ & రేటింగ్!
ఎంత మంచివాడవురా సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus