Siddharth Galla: మహేష్ మేనల్లుడు చేసుకోబోయే సౌత్ కొరియా అమ్మాయి గురించి తెలుసా?

ప్రముఖ కథానాయకుడు మహేష్‌బాబు మేనల్లుడు.. మాజీ ఎంపీ, ప్రముఖ వ్యాపారవేత్త గల్లా జయదేవ్‌ కొడుకు సిద్ధార్థ్‌ పెళ్లి త్వరలో జరగనుంది. ఈ మేరకు ఇటీవల ఆయన నిశ్చితార్థం జరిగింది. దీనికి సంబంధించిన వార్తలు ఇప్పుడు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. దానికి కారణం సౌత్ కొరియా అమ్మాయి కిమ్ హెయిన్‌తో ఆయన నిశ్చితార్థం జరగడమే. ఈ నేపథ్యంలో ఆమె వివరాల గురించి ఎక్కువమంది వెతుకుతున్నారు. అందుకే ఈ ప్రయత్నం.

Siddharth Galla

సిద్ధార్థ్‌ – సిద్ధార్థ్‌ చాలా కాలంగా స్నేహితులు. కిమ్ హెయిన్‌ హాస్పిటాలిటీ సర్వీసెస్ ఇండస్ట్రీలో పని చేస్తున్నట్లు సమాచారం. ఆమెను స్నేహితులు జిన్నీ అని పిలుస్తారట. హెయిన్ ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ చూస్తే… ట్రావెలింగ్. ఫిట్‌నెస్‌ అంటే ఇష్టమని తెలుస్తోంది. అందుకే ఆమె వివిధ దేశాలు తిరిగినట్టు అర్థమవుతోంది. సింగపూర్, థాయ్‌ లాండ్, ఇండోనేషియా, ఇటలీ, జపాన్, అమెరికా, సింగపూర్, భారత్‌లో ఆమె తెగ తిరిగేశారు.

గల్లా కుటుంబంతో కిమ్ హెయిన్‌కు అనుబంధం ఉందట. తమ తల్లిదండ్రులతో గతేడాది సింగపూర్‌లో సిద్ధార్థ్, కిమ్ ఒకే ఫ్రేమ్‌లో కనిపించారు. దాని బట్టి నిశ్చితార్థానికి ముందు ఇరు కుటుంబాలు కలిశాయని అర్థమవుతోంది. ఇక సిద్ధార్థ్ గల్లా, కిమ్ హెయిన్ పెళ్లి ఇటలీలో జరగనుంది. ఘట్టమనేని, గల్లా కుటుంబ సభ్యులతో పాటు అతి కొద్దిమంది బంధువులకు, మిత్రులకు ఆహ్వానాలు వెళ్లాయని టాక్‌. ఆ తర్వాత భారత్‌కి వచ్చి హైదరాబాద్‌లో రిసెప్షన్ పెడతారట.

గల్లా జయదేవ్, మహేష్ బాబు సోదరి పద్మావతి దంపతుల చిన్న కుమారుడే ఈ సిద్ధార్థ్. అతడి అన్నయ్య హీరో అశోక్ గల్లా. ‘హీరో’ సినిమాతో కథానాయకుడిగా అడుగు పెట్టాడు. ఆ తర్వాత కూడా ‘దేవకీ నందన వాసుదేవ’ సినిమా చేశాడు. ఇప్పుడు ‘విసా – వింటారా సరదాగా’ సినిమాతో రానున్నారు. సిద్ధార్థ్‌కి అయితే సినిమాల ఎంట్రీ ఆసక్తి లేదు అని చెబుతున్నారు.

మొదటి వారనికే బ్లాక్ బస్టర్.. 2వ వీకెండ్ కూడా కుమ్ముకునేలా ఉంది

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus