2018 లో అందరూ ఎదురుచూస్తున్న చిత్రాలు

  • December 18, 2017 / 01:08 PM IST

తెలుగు చిత్ర పరిశ్రమకు 2017 బాగా కలిసి వచ్చింది. చిరంజీవి ఖైదీ నంబర్ 150 తో మొదలైన విజయ పరంపర మొన్నటి అర్జున్ రెడ్డి వరకు కొనసాగింది. అఖిల్.. హలో అంటూ ఈ ఏడాదికి మంచి హిట్ తో గుడ్ బై చెప్పనున్నారు. అలాగే వచ్చే ఏడాది కూడా భారీ ప్రాజెక్ట్ లు సినీ జనాలను ఊరిస్తున్నాయి. 2018 లో ఆసక్తి రేకిస్తున్న తెలుగు సినిమాలపై ఫోకస్….

అజ్ఞాతవాసి జల్సా, అత్తారింటికి దారేది వంటి సూపర్ హిట్స్ ఇచ్చిన డైరక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ తో పవన్ కళ్యాణ్ చేస్తున్న మూడో సినిమా అజ్ఞాతవాసి. సాఫ్ట్ వేర్ ఇంజినీర్ గా పవన్ నటిస్తున్న ఈ చిత్రంలో అను ఇమ్మానియేల్, కీర్తి సురేష్ లు హీరోయిన్లుగా నటిస్తున్నారు. రీసెంట్ గా రిలీజ్ అయిన ఈ మూవీ టీజర్ యూట్యూబ్లో సంచలనం సృష్టిస్తోంది. జనవరి 10 న విడుదలకానున్న సినిమా అనేక రికార్డులను బద్దలు కొట్టనుంది.

జై సింహ సంక్రాంతి మొనగాడుగా పేరు దక్కించున్న బాలకృష్ణ ఈ ఏడాది గౌతమి పుత్ర శాతకర్ణితో సూపర్ హిట్ అందుకున్నారు. 2018 లో జై సింహా గా రాబోతున్నారు. కేఎస్ రవికుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ మూవీ జనవరి 11 న థియేటర్లో సందడి చేయనుంది.

భాగమతి బాహుబలి సినిమాల తర్వాత అనుష్క చేస్తున్న ఏకైన చిత్రం భాగమతి. పిల్ల జమీందార్ ఫేం అశోక్ దర్శకత్వంలోగత కొన్ని నెలలుగా షూటింగ్ జరుపుకున్న ఈ మూవీ ఫస్ట్ లుక్ రీసెంట్ గా రిలీజ్ అయి అంచనాలను పెంచేసింది. ఈ మూవీ జనవరి 26 రిలీజ్ అవుతోంది.

మహానటి తెలుగు చిత్ర పరిశ్రమ ఉన్నంతవరకు మహానటి సావిత్రి పేరు నిలిచిపోతుంది. ఆమె జీవితం ఆధారంగా ప్రస్తుతం సినిమా రూపుదిద్దుకోనుంది. నాగ్ అశ్విన్ సావిత్రి నిజ జీవిత కథను వెండితెరపై ఆవిష్కరించనున్నారు. కీర్తి సురేష్ సావిత్రి పాత్ర పోషిస్తున్న ఈ చిత్రం మార్చి 28 న మూడు భాషల్లో రిలీజ్ కానుంది.

రంగస్థలం ధృవ వంటి హిట్ తర్వాత మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ “రంగస్థలం” సినిమా చేస్తున్నారు. సుకుమార్ దర్శకత్వంలో పీరియాడిక్ లవ్ స్టోరిగా తెరకెక్కుతున్న ఈ సినిమా ఫస్ట్ లుక్ అదరగొట్టింది. సమంత హీరోయిన్ గా నటిస్తున్న ఈ మూవీ మార్చి 30 న రిలీజ్ కానుంది.

భరత్ అనే నేను శ్రీమంతుడు.. ఇండస్ట్రీ హిట్. ఆ కాంబినేషన్లో మూవీ అంటే భారీ అంచనాలు ఉంటాయి. అందుకే కొరటాల శివ దర్శకత్వంలో మహేష్ బాబు నటిస్తున్న భరత్ అనే నేను సినిమాపై క్రేజ్ నెలకొని ఉంది. ఇందులో తొలి సారి మహేష్ ముఖ్యమంత్రిగా నటిస్తుండడం ఆసక్తిని రేకెత్తిస్తోంది. ఈ చిత్రం ఏప్రిల్ 27 న థియేటర్లోకి రానుంది.

నా పేరు సూర్య కిక్, రేసు గుర్రం, టెంపర్ వంటి హిట్ చిత్రాలకి కథ అందించిన వక్కంతం వంశీ దర్శకుడిగా మారి తెరకెక్కిస్తున్న సినిమా నాపేరు సూర్య. స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ఇందులో సోల్జర్ గా నటిస్తున్నారు. రామలక్ష్మీ సినీ క్రియేషన్స్ పతాకంపై లగడపాటి శ్రీధర్, బన్నీ వాసు నిర్మిస్తున్న ఈ చిత్రం ఏప్రిల్ 27 న ప్రేక్షకుల ముందుకు రానుంది.

సాహో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ బాహుబలి తర్వాత డైరక్టర్ సుజీత్ దర్శకత్వంలో చేస్తున్న సాహో సినిమా షూటింగ్ వేగంగా సాగుతోంది. యూవీ క్రియేషన్స్ బ్యానర్ పై 150 కోట్లతో ఏక కాలంలో మూడు భాషల్లో వంశీ, ప్రమోద్ లు నిర్మిస్తున్న ఈ సినిమాలో యాక్షన్ సీన్స్ ప్రేక్షకులను థ్రిల్ చేయనుంది. శ్రద్ధ కపూర్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రం దీపావళికి కలక్షన్ల మతాబులు వెలిగించనుంది.

తొలిప్రేమ మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ఫిదా మూవీ తర్వాత వెంకీ అట్లూరి దర్శకత్వంలో తొలిప్రేమ చేస్తున్నారు. శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర బ్యానర్లో బీవీఎస్ఎన్ ప్రసాద్ నిర్మిస్తున్న ఈ చిత్రం లో హీరోయిన్ గా శీఖన్నా నటిస్తోంది. రొమాంటిక్ సన్నివేశాలను తెరకెక్కిస్తున్నారు. ఫిబ్రవరి 9న రిలీజ్ కానుంది.

నాగార్జున, వర్మ మూవీ 28 సంవత్సరాల క్రితం సంచలనం సృష్టించిన శివ కాంబినేషన్లో ఓ మూవీ రూపుదిద్దుకుంటోంది. ప్రస్తుతం ముంబై లో షూటింగ్ జరుపుకుంటున్న ఈ మూవీలో నాగార్జున పోలీస్ ఆఫీసర్ గా నటిస్తున్నారు. ఇందులో హీరోయిన్ ఉన్నా.. ప్రేమ లేదు, పాటలు లేవు అని వర్మ ముందుగానే చెప్పి మరింత ఆసక్తిని కలిగించారు. ఈ చిత్రం మార్చి 11 థియేటర్లోకి రానుంది.

ఎన్టీఆర్, త్రివిక్రమ్ మూవీ వరుసగా హిట్స్ తో దూసుకుపోతోన్న ఎన్టీఆర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో మూవీ చేయనున్నారు. ఫిబ్రవరిలో సెట్స్ మీదకు వెళ్లనున్న ఈ సినిమా సెప్టెంబర్ లో రిలీజ్ కానుంది. హారిక అండ్ హాసిని బ్యానర్లో రాధా కృష్ణ నిర్మించనున్న ఈ మూవీపై ఎన్టీఆర్ ఫ్యాన్స్ భారీ అంచనాలు పెట్టుకొని ఉన్నారు.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus