తెలుగు సినిమా ఇండస్ట్రీలో నందమూరి కుటుంబం నుంచి హీరోగా ఇండస్ట్రీకి పరిచయమైనటువంటి వారిలో కళ్యాణ్ రామ్ ఒకరు. నటుడుగా ఇండస్ట్రీలో ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి ఈయన ఒకవైపు హీరోగా నటిస్తూనే మరోవైపు నిర్మాతగా కూడా కొనసాగుతున్నారు. ఇలా నిర్మాతగా పలు సినిమాలలో ఎంతో బిజీగా ఉన్నారు. తాజాగా కళ్యాణ్ రామ్ కి సంబందించిన ఒక వార్త వైరల్ అవుతుంది. కళ్యాణ్ రామ్ ప్రముఖ వ్యాపారవేత్త కుమార్తే స్వాతి అనే అమ్మాయినీ వివాహం చేసుకున్న సంగతి మనకు తెలిసిందే.
ఈమే వృతి రీత్యా వైద్యురాలు. పెళ్లి తరువాత ఈమె ఇంటికి పరిమితమైయ్యారు. ఇక వీరిద్దరికీ ఇద్దరు సంతానం అనే సంగతి మనకు తెలిసిందే. ప్రతుతం వీరిద్దరూ వారి వైవాహిక జీవితంలో ఎంతో సంతోషంగా ఉన్నారు. ఇకపోతే కళ్యాణ్ రామ్ హీరోగా కొనసాగుతున్న సమయంలో ఈయన ఒక హీరోయిన్ ప్రేమలో పడ్డారట.ఇలా కళ్యాణ్ రామ్ హీరోయిన్ తో చనువుగా ఉన్నారు అనే విషయం తెలుసుకున్న హరికృష్ణ తన కొడుకుకు బాగా బ్రెయిన్ వాష్ చేసి హీరోయిన్ తో పెళ్లికి అడ్డుకున్నారని తెలుస్తుంది.
ఇలా హరికృష్ణ చెప్పడంతో కళ్యాణ్ రామ్ (Kalyan Ram) ఆ హీరోయిన్ కి దూరంగా ఉన్నారని తెలుస్తోంది. ఇలా హీరోయిన్ కి దూరంగా ఉన్న కళ్యాణ్ రామ్ అనంతరం స్వాతి అనే అమ్మాయిని వివాహం చేసుకొని తన వైవాహిక జీవితంలో ఎంతో సంతోషంగా ఉన్నారు. ఇక ఈయన చాలా కాలంగా హిట్ లేక ఎంతో ఇబ్బంది పడాగ బింబిసారా సినిమా ద్వారా హిట్ అందుకొని తిరిగి కెరియర్ పరంగా ఎంతో బిజీగా ఉన్నారు. ప్రస్తుతం ఈయన డెవిల్ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధంగా ఉన్నారు.