Amala Akkineni: కోట్లఆస్తి ఉన్న ఆ అదృష్టానికి నోచుకోని అమల!

తెలుగు సినీ ఇండస్ట్రీలో సెలబ్రిటీ కపుల్ గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి వారిలో నటుడు నాగార్జున అమల దంపతులు ఒకరు అని చెప్పాలి. వీరిద్దరూ ప్రేమించుకుని పెళ్లి చేసుకున్నారు. నాగార్జునకు అమల రెండో భార్య కావడం గమనార్హం. నాగార్జున అప్పటికే లక్ష్మి దగ్గుబాటి అనే అమ్మాయిని వివాహం చేసుకొని నాగచైతన్య జన్మించిన తర్వాత విడాకులు తీసుకున్నారు. ఈ విధంగా నాగార్జున విడాకులు తీసుకొని విడిపోయిన అనంతరం నటి అమల ప్రేమలో పడి తర్వాత ఆమెను వివాహం చేసుకున్నారు.

ఇక అమలా కూడా నటి కావడంతో ఈమె కూడా సినిమాల పరంగా భారీగానే సంపాదించి ఆ సంపాదన మొత్తం నాగార్జున చేతిలోనే పెట్టింది ఇంకా పెళ్లి తర్వాత అమలా పూర్తిగా సినిమాలకు దూరంగా ఉన్నారు. ఇక నాగార్జున సినిమా ఇండస్ట్రీలో కొనసాగుతూ కొన్ని వేల కోట్ల రూపాయల ఆస్తులను సంపాదించిన విషయం మనకు తెలిసిందే. ఈ విధంగా నాగార్జున అమల (Amala ) దంపతులకు వేల కోట్ల ఆస్తి ఉన్నప్పటికీ ఒక విషయంలో మాత్రం అదృష్టం లేదని తెలుస్తోంది.

మరి ఏ విషయంలో వీరికి అదృష్టం లేదనే విషయానికి వస్తే.. మనం అమలను ఎప్పుడు చూసినా మెడలో చిన్న నల్లపూసలు వేసుకుని మాత్రమే కనిపిస్తారు. ఎప్పుడు కూడా ఈమె బంగారు నగలను వేసుకోవడం మనం చూసి ఉండము. ఇలా అమల నల్లపూసలు వేసుకోవడానికి కారణమేంటి ఆమెకు బంగారం అంటే ఇష్టం లేదా అనే సందేహం అందరూ కలుగుతుంది.

అందరి మహిళల మాదిరిగానే అమలకు బంగారం అంటే ఎంతో ఇష్టమట. అయితే బంగారం వేసుకుంటే అమలకు స్కిన్ అలర్జీ వస్తుందని. అందుకే ఈమె బంగారం వేసుకోకుండా కేవలం నల్లపూసలు మాత్రమే వేసుకుంటారని తెలుస్తుంది. ఇలా ఎన్నో వేల కోట్ల ఆస్తులు ఉన్నప్పటికీ అమలకు మాత్రం తనకు ఇష్టమైనటువంటి నగలను వేసుకొనే అదృష్టం మాత్రం లేదని పలువురు ఈ విషయంపై కామెంట్స్ వ్యక్తం చేస్తున్నారు.

‘బిగ్ బాస్ 7’ కంటెస్టెంట్ ప్రియాంక జైన్ గురించి 10 ఆసక్తికర విషయాలు..!

‘బిగ్ బాస్ 7’ కంటెస్టెంట్ దామిని భట్ల గురించి 10 ఆసక్తికర విషయాలు!
‘బిగ్ బాస్ 7’ 14 మంది కంటెస్టెంట్స్ పారితోషికాల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus