Venkatesh: వెంకటేశ్ అల్లుడు ఆ బడా ఫ్యామిలీకి అల్లుడు కావాల్సి ఉందా?

Ad not loaded.

తెలుగు సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న విక్టరీ వెంకటేష్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. తాజాగా నటుడు వెంకటేష్ తన రెండవ కుమార్తె హయవాహినికి పెళ్లి చేయబోతున్న సంగతి మనకు తెలిసిందే. ఈయనకు ముగ్గురు కుమార్తెలు కాగా ఇదివరకే పెద్ద కుమార్తెకు పెళ్లి చేశారు తాజాగా రెండవ కుమార్తెకు విజయవాడలో ఎంతో ఘనంగా నిశ్చితార్థం జరిపించిన సంగతి తెలిసిందే. ఈ నిశ్చితార్థ వేడుకకు టాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన పలువురు స్టార్ సెలబ్రిటీలు అందరూ కూడా హాజరయ్యారు.

ఇక వెంకటేష్, ప్రముఖ డాక్టర్ కుటుంబం నుంచి వియ్యం అందుకోబోతున్నారని తెలుస్తోంది. వెంకటేష్ కాబోయే అల్లుడు కూడా ప్రముఖ డాక్టర్ దేశంలోనే టాప్ టెన్ గైనకాలజిస్టులలో ఈయన కూడా ఒకరిగా పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నారు. వీరికి విజయవాడలో కూడా పలు హాస్పిటల్స్ ఉన్నాయి. ఇదిలా ఉండగా తాజాగా వెంకటేష్ కి కాబోయే అల్లుడు ఆకాష్ గురించి తాజాగా ఒక వార్త వైరల్ గా మారింది

నిజానికి వెంకటేష్ (Venkatesh) ఇంటికి కాకుండా ఈయన మరో బడా ఫ్యామిలీకి అల్లుడుగా వెళ్లాల్సి ఉండేదట కొన్ని కారణాలవల్ల ఆ ఫ్యామిలీ రిజెక్ట్ చేయడంతో వెంకటేష్ ఇంటికి అల్లుడు కాబోతున్నారని తెలుస్తుంది. ముందుగా మెగా కుటుంబానికి ఆకాష్ ప్రపోజల్ వెళ్లడంతో నిహారిక తనకు డాక్టర్ సంబంధం వద్దు అంటూ ఈ ప్రపోజల్ రిజెక్ట్ చేశారట. ఇలా ఈమె ఈ ప్రపోజల్ రిజెక్ట్ చేయడం అనంతరం జొన్నలగడ్డ వెంకట చైతన్య ప్రపోజల్ రావడంతో ఆ ప్రపోజల్ కి కమిట్ అయి నిహారిక జొన్నలగడ్డ వెంకట చైతన్య వివాహం చేశారు.

అయితే తిరిగి ఆకాష్ వెంకటేష్ ఇంటికి అల్లుడుగా అడుగుపెట్టబోతున్నారు. ఏది ఏమైనా నిహారికను పెళ్లి చేసుకోకపోవడమే మంచి జరిగిందని లేకపోతే ఈపాటికి వీరిద్దరికి విడాకులు కూడా జరిగిపోయేవి అంటూ ఈ విషయం తెలిసినటువంటి కొందరు కామెంట్లు చేస్తున్నారు.

‘పుష్ప’ టు ‘దేవర’.. 2 పార్టులుగా రాబోతున్న 10 సినిమాలు..!

‘సైందవ్’ తో పాటు టాలీవుడ్లో వచ్చిన ఫాదర్-డాటర్ సెంటిమెంట్ మూవీస్ లిస్ట్..!
ఆ హీరోయిన్స్ చేతిలో ఒక సినిమా కూడా లేదంట..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus