‘జై’ క్యారెక్టర్ గురించి బయటికొచ్చిన మరో ఇంట్రెస్టింగ్ న్యూస్!

  • June 3, 2017 / 11:13 AM IST

యంగ్ టైగర్ ఎన్టీఆర్…టాలీవుడ్ యువ హీరోల్లో యంగ్ టైగర్ కి ఉన్న క్రేజ్ అంతా ఇంత కాదు. ఇంకా చెప్పాలి అంటే ఆయన చేస్తున్న సినిమాల లెక్క కన్నా…ఆయన క్రియేట్ చేస్తున్న రికార్డుల లెక్క చాలా ఎక్కువగా కనిపిస్తుంది. విషయంలోకి వెళితే, ఎన్టీఆర్ మునుపెన్నడూ లేని విధంగా టాలీవుడ్ లో తొలి సారి తాను మూడు పాత్రలు పోషిస్తున్న విషయం తెలిసిందే. అయితే అదే క్రమంలో ఈ సినిమాపై భారీ అంచనాలే నెలకొన్నాయి. వంద కోట్ల వసూళ్లు సాధించిన ‘జనతా గ్యారేజ్’ వంటి బ్లాక్ బస్టర్ తరువాత వస్తూ ఉండడం, ఈ సినిమాలో ఎన్టీఆర్ ట్రిపుల్ రోల్ చేస్తుండటం  అంతేకాదు, ఈ స్టోరీ ఎంపిక కోసం యంగ్ టైగర్ చాలా గ్యాప్ తీసుకోవడం వెరసి సినిమా సూపర్ హిట్ అనే చెప్పాలి. అయితే అదే క్రమంలో ఈ సినిమాలో ఎన్టీఆర్ పాత్రలపై ఇండస్ట్రీలో తీవ్రమైన చర్చ జరుగుతుంది.

అయితే అదే క్రమంలో ఈ సినిమాకి సంభందించి ఒక కీలక విషయం లీక్ అయ్యింది అని సమాచారం. అదేమిటి అంటే ఈ సినిమాలో ఎన్టీఆర్ పోషించబోయే ఒక క్యారెక్టర్‌కు కాస్త నత్తి ఉంటుందని… ఆ పాత్రే సినిమాకు కీలకమని, నత్తి ఉండే యువకుడిగా కనిపించబోయే ఎన్టీఆర్ పాత్రే సినిమాలో విలన్‌గా ఉంటుందని, నాలెడ్జ్ విషయంలో ఇంటలిజెంట్ అయినా… తన ఆలోచనలను ఎవరికీ చెప్పలేని ఆ క్యారెక్టర్ సినిమాలో విలన్‌గా మారి దుమ్ము దులుపుతుంది అని తెలుస్తుంది. అసలే ఫర్స్ట్ టైమ్ ఎన్టీఆర్ నెగేటివ్ రోల్ చేస్తున్నాడు. మరో పక్క ఫర్స్ట్ టైమ్ ట్రిపల్ రోల్ చేస్తున్నాడు…మరి ఇన్ని డిఫరెంట్ వేరీయేషన్స్ ఉన్నా ఈ సినిమా ఎంతవరకూ ఆకట్టుకుంటుందో చూడాలి.


Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus