ఆ ఇద్దరు స్టార్‌లు అనుకోని అతిథులట.. వైరల్‌ వెబ్‌ సిరీస్‌ గురించి ఇంట్రెస్టింగ్‌ ఇన్ఫో

బాలీవుడ్‌ స్టార్‌ హీరో షారుఖ్‌ ఖాన్‌ తనయుడు ఆర్యన్‌ ఖాన్‌ ఇటీవల దర్శకుడిగా అరంగేట్రం చేస్తూ ‘ది బ్యాడ్స్‌ ఆఫ్ బాలీవుడ్‌’ అనే వెబ్‌ సిరీస్‌ స్ట్రీమింగ్‌కి వచ్చింది. నెట్‌ఫ్లిక్స్‌లో ఉన్న ఈ సిరీస్‌లో ప్రముఖ దర్శకుడు ఎస్‌.ఎస్‌.రాజమౌళి, ప్రముఖ హీరో ఆమిర్‌ ఖాన్‌ అతిథులుగా కనిపించారు. సిరీస్‌ స్ట్రీమింగ్‌కి దగ్గరకు వస్తున్న సమయంలో ఈ ఇద్దరి గురించి ప్రముఖంగా ప్రస్తావిస్తూ ప్రచారం కూడా చేశారు. అయితే ఆ రెండు పాత్రలు తొలుత అనుకున్నవి కావు. నిమిషాల్లో ఓకే అనుకుని రాసినవట. ఈ విషయంలో ఆ సిరీస్‌లో నటించిన హీరోయినే ఈ విషయం చెప్పుకొచ్చింది.

The Ba***ds of Bollywood

ఆమిర్‌ ఖాన్‌, రాజమౌళి సన్నివేశాన్ని ముందుగా ప్లాన్‌ చేసుకోలేదని, అప్పటికప్పుడు అనుకొని రాసినదని హీరోయిన్‌ అన్య చెప్పారు. అంతేకాదు దర్శకుడు ఆర్యన్‌ 20 నిమిషాల్లో రాశారని కూడా తెలిపారు. ముంబయిలోని ఓ స్టూడియోలో ఈ సిరీస్‌ షూటింగ్‌ జరుగుతుండగా రాజమౌళి, ఆమిర్‌ వారి ప్రాజెక్ట్‌ల కోసం అక్కడికి వచ్చారని ఆర్యన్‌కు తెలిసిందట. వెంటనే తాను 20 నిమిషాల్లో ఒక సన్నివేశం రాస్తానని.. మీరు కాస్ట్యూమ్స్‌ మార్చుకోండి అని నటీనటుల్ని కోరారట. అలా వారు వెళ్లి వచ్చేసరికి ఆర్యన్‌ ఆ సీన్స్‌ రెడీ చేశారట.

అలా రాజమౌళి, ఎస్.ఎస్‌.రాజమౌళి ఈ సిరీస్‌లో భాగమయ్యారని నటి అన్య తెలిపింది. బాలీవుడ్‌లో తొలి ప్రయత్నంలోనే హిట్‌ కొట్టిన హీరో జీవితంలో ఎలాంటి మార్పులొచ్చాయన్న కథాంశంతో ‘ది బ్యాడ్స్‌ ఆఫ్ బాలీవుడ్‌’ రూపొందింది. ‘కిల్‌’ సినిమాతో ఇప్పటికే థ్రిల్‌ చేసిన లక్ష్య సెటిల్డ్‌ ఈ సిరీస్‌లో పెర్ఫామెన్స్‌ ఇచ్చాడు. ఇక ఈ సిరీస్‌లో షారుఖ్‌ ఖాన్‌, రణ్‌వీర్‌ సింగ్‌, ఇమ్రాన్‌ హష్మీ, సారా అలీఖాన్‌ కూడా మెరిశారు.

చిరు – బాబీ సినిమాలో అనుష్క?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus