Balakrishna: బాలకృష్ణకు ఇప్పుడు పూర్తిగా క్లారిటీ వచ్చిందా? తనవారెవరో, కానివారెవరో తెలిసిపోయిందా?

ఒక కష్టం, ఒక నష్టం… మనిషికి చాలా విషయాలు నేర్పిస్తాయి అని అంటారు. అప్పటివరకు ఒకలా కనిపించిన లోకం, వినిపించిన అంశాలు, ఎదురుపడిన మనుషులు ఆ పరిస్థితి తర్వాత డిఫరెంట్‌గా కనిపిస్తారు. ఎంతోమంది మానసిక వికాస నిపుణులు ఈ విషయాల్ని చెబుతూ ఉంటారు. అయితే ఈ విషయంలో క్లారిటీ ఆ వ్యక్తి అనుకున్నప్పుడు మాత్రమే లభిస్తుంది. తెలుగు సినిమా పరిశ్రమలో ఇలా అయినవారెవరు, కానివారెవరు అనే విషయాన్ని కొంతమంది నటులు, ముఖ్యంగా హీరోలు తెలుసుకున్నారు. ఇప్పుడు నందమూరి బాలకృష్ణ కూడా తెలుసుకున్నారా?

Balakrishna

ఏమో.. ఆయన కొత్త సినిమా ‘అఖండ 2: తాండవం’ సినిమా పరిస్థితి చూస్తుంటే అలానే అనిపిస్తోంది. కావాలంటే మీరే చూడండి. వరుసగా నాలుగు విజయాలతో మాంచి ఊపు మీద ఉన్న బాలయ్య సినిమా విడుదలకు ఫ్యాన్స్‌ ఆసక్తిగా ఉన్నారు. సడన్‌గా ఎప్పటిదో పాత సినిమా, అందులోనూ బాలయ్యకు సంబంధం లేని సినిమా పంచాయితీ ఒకటి ముందుకొచ్చి ఈ సినిమాను ఆపేసింది. నిజానికి ఇలాంటి సమస్యలు టాలీవుడ్‌ హీరోలకు కొత్తేమీ కాదు, బాలకృష్ణకు కూడా కొత్త కాదు. అయితే ఎప్పుడు తేలుతుందో అనే క్లారిటీ లేని సినిమా ఇదీ. అందులో టాలీవుడ్‌.. దేశంలోనే పెద్ద సినిమా పరిశ్రమగా మారాక జరిగిన విషయం ఇదీ.

దీంతో, ఈ విషయం తేల్చడానికి టాలీవుడ్ నుండి ఎవరు బాలకృష్ణ వైపు నిలబడతారు / నిలబడ్డారు అనే చర్చ మొదలైంది. నిజానికి ‘అఖండ 2: తాండవం’ ఆర్థిక పంచాయితీ విషయంలో బాలకృష్ణ ఇప్పటివరకు నేరుగా ఎక్కడా ఇన్వాల్వ్‌ కాలేదు. అయితే నిర్మాతలకు తన వంతుగా మోరల్‌ సపోర్టు ఇస్తూ బ్యాక్‌బోన్‌గా నిలబడుతున్నారు. అయితే మరి బాలయ్యకు బ్యాక్‌బోన్‌గా ఎవరున్నారు. సినిమా పరిశ్రమ నుండి ఎవరైనా పెద్దలు ఈ విషయంలో ముందుకొచ్చి మాట్లాడారా అంటే సురేశ్‌ బాబు కనిపించారు.

ఆయన మాత్రమే కాకుండా మరికొంతమంది నిర్మాతలు, ఫైనాన్సియర్లు ముందుకొచ్చి సినిమా విషయం తేల్చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నారట. ఇదంతా చూశాక ఇప్పుడు బాలయ్యకు (బాలయ్య సినిమాకు) ఎవరు తనవారు, ఎవరు కాదు అనే విషయంలో క్లారిట వచ్చే ఉంటుంది. పవన్‌ కల్యాణ్‌కు ఇటీవల ‘హరి హర వీరమల్లు’ సమయంలో ఈ క్లారిటీ వచ్చింది. అందుకే ఓ వేదిక మీద ఆ సినిమా విడుదలలో సాయం చేసిన అందరికీ పేరు పేరునా థ్యాంక్యూ చెప్పారు.

 హీరోయిన్ అత్యాచార కేసులో సంచలన తీర్పు.. బయటపడ్డ హీరో, దోషులు ఎవరంటే?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus