Icon: కొంపతీసి ‘ఐకాన్’ చేస్తున్నారా?
- July 15, 2026 / 11:53 AM ISTByPhani Kumar
‘పుష్ప’, ‘పుష్ప 2’ వంటి బ్లాక్‌బస్టర్స్..తో అల్లు అర్జున్ పాన్ ఇండియా స్థాయిలో తిరుగులేని క్రేజ్ సొంతం చేసుకున్నాడు. దేశవ్యాప్తంగా తనకు దక్కిన ఈ భారీ మాస్ ఇమేజ్‌ను మరింత సుస్థిరం చేసుకునే దిశగా ఆయన తన తదుపరి చిత్రాల ఎంపికలో ఆచితూచి అడుగులేస్తున్నాడు అని చెప్పాలి. ఇప్పటికే షారుఖ్ ఖాన్ ‘జవాన్’ చిత్రంతో పాన్ ఇండియా వైడ్ సెన్సేషన్ క్రియేట్ చేసిన దర్శకుడు అట్లీతో ‘రాకా’ అనే భారీ ఫాంటసీ యాక్షన్ మూవీలో నటిస్తున్న సంగతి తెలిసిందే. దీంతో పాటు లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలోనూ ఒక భారీ ప్రాజెక్టుకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. వీటితో పాటు మలయాళంలో ‘మిన్నల్ మురళి’ సినిమా తీసి దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు బాసిల్ జోసెఫ్‌తోనూ బన్నీ ఓ భారీ ప్రాజెక్టు చేయబోతున్నట్టు ఇదివరకే టీం హింట్ ఇచ్చింది.
ICON Movie
![]()
ఈ ప్రాజెక్టు ఒక సూపర్ నేచురల్ థ్రిల్లర్ గా ఉండబోతుందని అంతా భావించారు. కానీ, సడన్‌గా బాసిల్ జోసెఫ్ తన సోషల్ మీడియా ఖాతాలో ‘ఐకాన్’ అని పోస్ట్ చేసి టాలీవుడ్ ఇండస్ట్రీ వర్గాల్లో సరికొత్త చర్చకు తెరలేపాడు.వాస్తవానికి గతంలో దిల్ రాజు నిర్మాణంలో, వేణు శ్రీరామ్ దర్శకత్వంలో ‘ఐకాన్’ (కనబడుటలేదు అనేది క్యాప్షన్) ప్రాజెక్ట్ ను అనౌన్స్ చేశారు. కానీ ఆ తర్వాత పలు కారణాల వల్ల ఆ ప్రాజెక్టు ఆగిపోయింది. ఇప్పుడు బాసిల్ చేసిన పోస్ట్‌తో.. ఆగిపోయిన ఆ పాత ‘ఐకాన్’ ప్రాజెక్ట్‌ను ఈ మలయాళ దర్శకుడు టేకప్ చేశాడా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దీనిపై క్లారిటీ రావాల్సి ఉంది. ప్రస్తుతానికైతే.. బాసిల్ జోసెఫ్ పోస్ట్ తెగ వైరల్ అవుతుంది.
Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus
















