మహేష్‌బాబును టాలీవుడ్లో అజాత శత్రువు అని అంటుంటారు. తండ్రి కృష్ణ లాగే ఎవరితోనూ ఆయనకు గొడవలు ఉండవు. అయితే ఒకరిద్దరు దర్శకులతో ఆయనకు మనస్పర్థలు ఉన్నాయని చెబుతుంటారు. దానికి కారణం కూడా ఆయన మాటలే. ఆ మధ్య ఓ సినిమా ప్రి రిలీజ్ ఈవెంట్లో తన సినిమాల దర్శకుల గురించి చెబుతూ ఓ దర్శకుడి గురించి దాటేశారు. దీంతో సమ్‌థింగ్ సమ్‌థింగ్ అంటూ ప్రచారం సాగింది. అతనే సుకుమార్. అయితే అప్పుడు ఏమైనా జరిగిందా లేదా అనేది పక్కన పెడితే…
ఇప్పుడు అంతా ఓకే అని అంటున్నారు. మహేష్‌బాబు ‘సర్కారు వారి పాట’ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ఘనంగా జరిగింది. ఈ వేడుకకు ప్రముఖ దర్శకుడు సుకుమార్ ఓ అతిథిగా విచ్చేశారు. మహేష్‌తో పాటు చక్కగా మాట్లాడుతూ, జోష్‌లో కనిపించారు. ఆ తర్వాత స్టేజీ మీద మహేష్‌ను పొగడ్తలతో ముంచెత్తారు సుకుమార్. దీంతో మహేష్‌బాబు అభిమానులు తెగ ఆనందడిపోతున్నారు. కారణం ఇద్దరి మధ్య పచ్చ గడ్డి వేస్తే భగ్గుమంటుంది అంటూ రకరకాల పుకార్లు రావడమే. ‘సర్కారు వారి పాట’ ప్రీ రిలీజ్ ఈవెంట్ ఆ మొత్తం పుకార్లకు ఫుల్స్టాప్ పెట్టినట్లయింది.
గొడవలు, పుకార్లు అని అంటున్నారు… ఎప్పటి గొడవలు? అని అనుకుంటున్నారా. అవి ఇప్పటివి కావులెండి. ఎప్పుడు ‘వన్ నేనొక్కడినే’ సమయంలోనివి. ఆ సినిమా భారీ అంచనాలతో విడుదలై బాక్సాఫీసు దగ్గర దారుణ పరాజయం పాలైంది. దాంతో సుకుమార్ దర్శకత్వంలో మహేష్ చేయడం ఇక కష్టమే అని అనుకున్నారు. కానీ ఏమైందో ఏమో, ఆ తర్వాత అనుకున్న సినిమా అర్ధాంతరంగా ఆగిపోయింది. దీంతో ఇద్దరి మధ్య ఏదో జరిగింది అని అనుకోవడం మొదలుపెట్టారు.
సుకుమార్ ప్రతిభ మీద నమ్మకంతో ‘వన్ నేనొక్కడినే’ ఫలితంతో సంబంధం లేకుండా ఇంకో సినిమా చేయడానికి సిద్ధపడ్డారు మహేష్‌బాబు. కానీ కొన్ని నెలల చర్చల తర్వాత ఆ సినిమా క్యాన్సిల్ అయింది. తర్వాత అల్లు అర్జున్‌తో ‘పుష్ప’ ప్రారంభించేశారు సుకుమార్. సరిగ్గా అదే సమయంలో ‘మహర్షి’ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్లో సుకుమార్‌ను ఉద్దేశించి కౌంటర్లు వేశాడని పెద్ద చర్చ నడిచింది. నిజానికి సుకుమార్‌తో సినిమా క్యాన్సిల్ అయినపుడు తామిద్దరం మళ్లీ కలసి సినిమా చేస్తామని మహేష్ చెప్పినప్పటికీ అలాంటి సంకేతాలు కనిపించకపోవడంతో ఇద్దరికీ చెడిందనే ప్రచారం ఎక్కువైంది. ఇప్పుడు ఆవన్నీ క్లోజ్ అయ్యాయి అనుకోవచ్చు.
Most Recommended Video
కన్మణి రాంబో కటీజా సినిమా రివ్యూ & రేటింగ్!
వీళ్ళు సరిగ్గా శ్రద్ద పెడితే… బాలీవుడ్ స్టార్లకు వణుకు పుట్టడం ఖాయం..!
కే.జి.ఎఫ్ హీరో యష్ గురించి ఈ 12 విషయాలు మీకు తెలుసా..!