King 100: నాగార్జున ‘కింగ్ 100’.. డిసెంబరు 24న రావడం లేదా?
- September 9, 2026 / 05:46 PM ISTByFilmy Focus Desk
టాలీవుడ్ మాత్రమే కాదు.. మొత్తం ఇండియన్ సినిమా ఇటీవల ఓ గ్లింప్స్ చూసి.. ‘వావ్’ అంటూ సింగిల్ స్పెషల్ ఎక్స్‌ప్రెషన్ ఇచ్చి.. ఆ సినిమా మీద అంచనాలు పెరిగేలా చేశారు. ఆ సినిమానే అక్కినేని నాగార్జున వందో సినిమా ‘కింగ్ 100’. ఈ సినిమాను డిసెంబరు 24న విడుదల చేస్తాం అని క్లారిటీ కూడా ఇచ్చారు. దీంతో 2026కి సాలిడ్ ముగింపు ఉంటుందని.. అది కూడా ఇద్దరు అగ్ర హీరోలు ఇస్తారని కూడా అనుకున్నాం. కానీ విజయ్ దేవరకొండ మాటలు వింటుంటే అలా అనిపించడం లేదు.
King 100
గత కొన్ని వారాలుగా టాలీవుడ్‌లో ఓ నెరేటివ్‌ని బాగా బిల్డప్ చేస్తున్నారు. అదే తెలుగు సినిమాకు మంచి రోజులు మళ్లీ వచ్చాయి. ప్రేక్షకులు థియేటర్లకు రావడానికి ఆసక్తి చూపిస్తున్నారు అంటూ టాలీవుడ్ జనాలు చెప్పుకొస్తున్నారు. వాళ్లు చెప్పింది నిజమే జనాలు థియేటర్లకు వెళ్తున్నారు. అయితే దానికి కారణం టాలీవుడ్ ఏదో చేసేయడం కాదు. సరైన సినిమాలు తీయడం మాత్రమే. ఆ విషయం వదిలేస్తే.. ఇప్పుడు రాబోయే సినిమా వాళ్లు ఇదే మాటను తమ ప్రచారానికి వాడుకుంటున్నారు.

టాలీవుడ్ ఈ మధ్య కాలంలో అదిరిపోతోందని.. త్వరలో రాబోయే సినిమాలు కూడా అలానే ఉంటాయి అంటూ తమ సినిమాల విషయంలో పాజిటివ్ వైబ్ ఒకటి క్రియేట్ చేసుకుంటున్నారు. ఈ క్రమంలో ‘ఎపిక్’ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో యువ కథానాయకుడు విజయ్ దేవరకొండ మాట్లాడుతూ.. రానున్న మూడు నెలలు టాలీవుడ్‌లో అదిరిపోతాయి అని చెప్పారు. రెండ్రోజుల్లో ‘ఎపిక్’ సినిమా వస్తుంది. ఆ తర్వాత నాని – శ్రీకాంత్ ఓదెల ‘ది ప్యారడైజ్’ వస్తుంది. ఆ తర్వాత నేను, రాహుల్ సాంకృత్యాన్ చేస్తున్న ‘రణబాలి’ వస్తుంది. ఆ వెంటనే రష్మిక ‘మైసా’ సినిమా వస్తుంది అని చెప్పాడు.
ఇక్కడి దాకా అంతా బాగుంది. మధ్యలో ఒకట్రెండు చిన్న సినిమాలు వదలేసి ఉండొచ్చు. అయితే డిసెంబరు గురించి మాట్లాడేసరికి ప్రభాస్ ‘ఫౌజీ’, బాలకృష్ణ ‘దాదా’ సినిమాల గురించే చెప్పాడు విజయ్. అదే నెలలో రిలీజ్ డేట్ పెట్టుకున్న ‘కింగ్ 100’ గురించి చెప్పలేదు. దీంతో నాగార్జున సినిమా చెప్పిన డేట్‌కి రావడం లేదా? లేక విజయ్ ఆ పేరు వదిలేశాడా అనేది తెలియాలి.















