కీర్తి సురేష్, నిత్యామీనన్ వీరిద్దరి మధ్య పోటీలో ఎవరు గెలుస్తారు?

తెలుగు సినీ చరిత్రలో మహానటి ఎవరు అంటే ఇప్పటికి ఎప్పటికి అందరు చెప్పే పేరు సావిత్రి. మరి అంతటి మహానటి బయోపిక్ తీసి హిట్ కొట్టడం అంటే మాములు విషయం కాదు. అయితే మహానటి సినిమాలో కీర్తి సురేష్ నటిస్తున్నప్పుడు చాలా విమర్శలే వచ్చాయి. కానీ సినిమా విజయంతో వారందరి నోటికి తాళం వేసి సూపర్ గా చేసిందనే ప్రసంశలు పొందింది. ఈ సినిమాకి మొదటగా సావిత్రి గారి పాత్రకి నిత్యామీనన్ ని అనుకున్నప్పటికీ కొన్ని కారణాల వలన ఆమె ఈ సినిమా నుండి తప్పుకుంది.

ఇక విషయంలోకి వెళితే, స్వర్గీయ నందమూరి తారకరామారావు గారి బయోపిక్ రెండు భాగాలుగా రానుంది. క్రిష్ డైరెక్షన్ చేస్తుండగా, హీరో బాలకృష్ణ ఎన్టీయార్ గారి పాత్రలో నటిస్తున్నారు. ఈ సినిమాలో కొన్ని సీన్లలో ఎన్టీయార్, సావిత్రి గారి కాంబినేషన్స్ ఉండగా సావిత్రి గారి పాత్రకు డైరెక్టర్ క్రిష్ నిత్యా మీనన్ ని ఎంపిక చేశారంటా. మహానటి సినిమాలో మిస్ అయినా ఛాన్స్ ఈ సినిమా రూపంలో రాగా ఆమె ఈ పాత్రకి ఏ మేరకు న్యాయం చేస్తుందో చూడాలి. ఇప్పటికే ప్రేక్షకులు కీర్తి లో మహానటి ని చూసి ముచ్చట పడగ, నిత్యా మీనన్ ని సావిత్రి గారి పాత్రలో ఎలా ఉహించుకుంటారో అర్ధం కానీ విషయమే. మరి వీరిద్దరిలో అసలు మహానటి ఎవరు అనేది సంక్రాంతికి ఎన్టీయార్ సినిమా రిలీజ్ తరువాత తెలియనుంది.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus