నటి మూడో పెళ్లి కూడా పెటాకులేనా..?

వివాదాస్పద నటి వనితా విజయ్ కుమార్ లాక్ డౌన్ లో మూడో పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. 2000లో టెలివిజన్ రంగానికి చెందిన ఓ వ్యక్తిని పెళ్లి చేసుకున్న వనితా.. ఏడేళ్ల తరువాత అతడికి దూరమైంది. ఆ తరువాత మరో వ్యక్తిని రెండో పెళ్లి చేసుకుంది. ఆ పెళ్లి బంధం ఎక్కువ రోజులు నిలవలేదు. రీసెంట్ గా సినిమా ఇండస్ట్రీకి చెందిన పీటర్ పాల్ ని వనితా జూన్ లో వివాహం చేసుకుంది. ఈ పెళ్లి కోలీవుడ్ లో పెద్ద వివాదానికి తెర తీసింది. పీటర్ పాల్ మొదటి భార్య తనకు విడాకులు ఇవ్వకుండానే మరో పెళ్లి చేసుకున్నాడంటూ కేసు పెట్టింది. దీంతో పలువురు సినీ ప్రముఖులు వనితాపై విమర్శలు కురిపించారు. దీంతో వనితా.. ఈ విషయాన్ని న్యాయపరంగా చూసుకుంటామని స్పష్టం చేశారు.

ఇదిలా ఉండగా.. రీసెంట్ గా వనితా తన భర్త పీటర్, పిల్లలతో కలిసి గోవా ట్రిప్ కి వెళ్లి వచ్చింది. అక్కడ వీరిద్దరూ తీసుకున్న ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. అయితే కోలీవుడ్ మీడియా వర్గాల సమాచారం ప్రకారం.. వనితా, పీటర్ ల మధ్య మనస్పర్థలు వచ్చినట్లు తెలుస్తోంది. గోవా ట్రిప్ లో పీటర్ ఎక్కువగా మద్యం సేవించి నానా గొడవ చేశాడట. అంతేకాదు.. వనితాతో అసభ్యంగా ప్రవర్తించడంతో ఆమె కొట్టిందట. అక్కడ నుండి చెన్నైకి వచ్చిన తరువాత కూడా పీటర్ మద్యం మత్తులో ఉండడంతో అతడిని ఇంటి నుండి తరిమేసిందట వనిత.

ప్రస్తుతం ఈ వార్త కోలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది. ఈ విషయాన్ని కన్ఫర్మ్ చేస్తూ.. నిర్మాత రవీందర్ చంద్రశేఖరన్ తన సోషల్ మీడియాలో ”ఇల్లీగల్ మ్యారెక్ కి వ్యతిరేకంగా చాలా మంది కోరుకున్న కోరిక నెరవేరింది. పీపీ(పీటర్ పాల్)ని తరిమేశారు” అంటూ పోస్ట్ పెట్టాడు. మరి ఈ విషయంపై వనితా స్పందిస్తుందేమో చూడాలి!

Most Recommended Video

టాలీవుడ్ లో తెరకెక్కిన హాలీవుడ్ చిత్రాలు!
బిగ్‌బాస్‌ ‘రౌడీ బేబీ’ దేత్తడి హారిక గురించి ఈ విషయాలు మీకు తెలుసా?
రజినీ టు ఎన్టీఆర్.. జపాన్ లో కూడా అదరకొట్టిన హీరోలు వీళ్ళే..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus