Fauzi: ‘ఫౌజీ’ వాయిదా.. నిజమేనా?
- September 9, 2026 / 03:36 PM ISTByPhani Kumar
‘ఫౌజీ'(Fauzi) సినిమాని డిసెంబర్ 4న విడుదల చేస్తున్నట్టు మేకర్స్ ప్రకటించారు. డిసెంబర్ 3 రాత్రి నుండే ప్రీమియర్ షోలు వేస్తున్నట్టు ఇటీవల మరో అప్డేట్ ఇచ్చారు. ‘మైత్రి మూవీ మేకర్స్’ వారు ప్రభాస్ తో నిర్మిస్తున్న సినిమా ఇది. హను రాఘవపూడి దర్శకుడు. నిజం చెప్పాలంటే.. ఈ ప్రాజెక్టు పై మొదట ప్రభాస్ ఫ్యాన్స్ అటెన్షన్ లేదు. కానీ మేకర్స్ వదిలిన పోస్టర్స్ బాగున్నాయి. దాంతో కామన్ ఆడియన్స్ లో ‘ఫౌజీ’ బాగుంటుందనే నమ్మకాన్ని వ్యక్తం చేశారు.
Fauzi

మేకర్స్ లో కూడా కాన్ఫిడెన్స్ కనిపిస్తుంది. ‘మీరు ఎంతైనా ఊహించుకోండి.. దానికంటే ఎక్కువే ఉంటుంది ఫౌజీ’ అని మేకర్స్ చెప్పడం జరిగింది. పైగా డిసెంబర్ 4 అనేది ‘మైత్రి’ వారికి కలిసొచ్చిన డేట్. గతంలో అదే డేట్ కి రిలీజ్ అయిన ‘పుష్ప 2’ సినిమా భారీ వసూళ్లు సాధించింది. నార్త్ లో కూడా ఆ సినిమా భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. దీంతో ‘ఫౌజీ’ కి ఆ డేట్ కలిసొస్తుందేమో అనే నమ్మకం ప్రభాస్ ఫ్యాన్స్ లో ఏర్పడింది.
అయితే ఇప్పుడు ‘ఫౌజీ’ ఆ డేట్ కి రాకపోవచ్చు అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అందుకు కారణం.. వరుసగా కొన్ని మిడ్ రేంజ్ సినిమాలని డిసెంబర్ 3, 4 డేట్లకి రిలీజ్ చేస్తున్నట్టు ప్రకటిస్తుండటమే. అవును.. మొన్నటికి మొన్న డిసెంబర్ 4న విశ్వక్ సేన్ ‘లెజసీ’ విడుదల చేస్తున్నట్టు ప్రకటించారు ఆ సినిమా మేకర్స్. తాజాగా వృషకర్మ’ చిత్రాన్ని కూడా డిసెంబర్ 3న విడుదల చేస్తున్నట్టు ప్రచారం జరుగుతుంది.
‘ఫౌజీ’ లాంటి పెద్ద సినిమాకి పోటీగా ఈ మిడ్ రేంజ్ సినిమాలు రిలీజ్ అయ్యే అవకాశం లేదు. ‘ఫౌజీ’ రాదు అనే కన్ఫర్మేషన్ ఆ సినిమా మేకర్స్ నుండీ తీసుకున్న తర్వాతే… రిలీజ్ డేట్ అనౌన్స్ చేసి ఉండాలి. అందుకే పరోక్షంగా తమ సినిమాల రిలీజ్ డేట్లు వార్తల్లో ఉండేలా చేసి.. ‘ఫౌజీ’ రిలీజ్ పై క్లారిటీ ఇస్తున్నారేమో..! అదే నిజమైతే ‘ఫౌజీ’ కొత్త రిలీజ్ డేట్ ఏంటో? అధికారిక ప్రకటన వస్తే కానీ చెప్పలేని పరిస్థితి.
నాకు శేఖర్ కమ్ముల హీరోలు నచ్చరు: సందీప్ రెడ్డి వంగా











