Samantha: సమంత నో అంటోంది.. మరి నందిని ఏమంటారు.. క్లారిటీ త్వరలో?

  • June 16, 2023 / 10:41 PM IST

కొన్ని కాంబినేషన్లు ఊహించలేం.. వారి కలయికలో సినిమా వస్తే ఎలా ఉంటుందో చెప్పలేం. కానీ వన్స్ వచ్చాక ఆ కాంబినేషన్‌ మళ్లీ మళ్లీ రావాలని కోరుకుంటాం. అలాంటి కాంబోల్లో సమంత – నందిని రెడ్డి ఒకటి. తొలి సినిమాతో ఇద్దరూ కాస్త భయపెట్టినా.. ఆ తర్వాత రెండో సినిమాతో అదరగొట్టేశారు. ఇప్పుడు మూడో సినిమాకు అంతా రెడీ అనుకున్నారు. అయితే ఈ సినిమా విషయంలో సమంత మనసు మార్చుకుంది అని టాక్‌ వినిపిస్తోంది. సామ్‌ ఫ్యాన్స్‌కి ఇది హార్డ్‌ న్యూస్‌ అయినా.. ఇదే నిజం అంటున్నారు.

‘ఓ బేబీ’ సినిమాతో సమంతలో కొత్త రకం నటిని చూపించారు నందిని రెడ్డి. గతంలో ‘జబర్‌దస్త్‌’ అనే సినిమా చేసినా అది ఇబ్బందికర ఫలితాన్నిచ్చింది. ఆ భయంతోనే ‘ఓ బేబీ’ సినిమాను సమంత ఓకే చేసింది. కానీ ఆ సినిమా కాన్సెప్ట్‌, సమంత నటన అన్నీ కలిసొచ్చి అదిరిపోయింది. దీంతో మూడో సినిమా ఎప్పుడు ఈ కలయికలో అని అందరూ అడగసాగారు. దీనికి సమంత నుండి సరైన సమాధానం రాలేదు కానీ. మొన్నామధ్య నందిని రెడ్డి దగ్గర నుండి అయితే వచ్చింది. ఇప్పుడు మళ్లీ డౌట్‌ అంటు్నారు.

నందిని రెడ్డి ఇటీవల తెరకెక్కించిన ‘అన్నీ మంచి శ‌కున‌ములే’ సినిమా ప్రచారంలో సమంత సినిమా గురించి కూడా మాట్లాడారు. ఈ సినిమా పనులు అయిపోయిన వెంట‌నే స‌మంత‌తో సినిమా ప‌ట్టాలెక్కిస్తా అని చెప్పారు. అందులో సిద్ధు జొన్న‌ల‌గ‌డ్డ హీరో అని కూడా సమాచారం వచ్చింది. దీంతో ఈ మాస్‌ హీరో – సూపర్‌ హీరోయిన్‌ కాంబో గురించి అందరూ అంచనాల లెక్కలేసుకున్నారు. కానీ ఇప్పుడు ఈ సినిమా స‌మంత చేస్తుందా? లేదా? అనేది అనుమానంగా మారింది.

డేట్లు స‌ర్దుబాటు కావడం లేద‌ని (Samantha) స‌మంత చెబుతోంద‌ట‌. దీంతో స‌మంత కోసం నందిని రెడ్డి కొంత కాలం ఆగుతారా? లేక వేరో హీరోయిన్‌తో ప్రొసీడ్‌ అవుతారా అనేది తేలాల్సి ఉంది. త్వరలోనే ఈ విషయంలో క్లారిటీ ఇస్తారు అని అంటున్నారు. సమంత ప్రస్తుతం ‘ఖుషి’, ‘సిటాడెల్‌’ పనుల్లో బిజీగా ఉంది.

ఆదిపురుష్ సినిమా రివ్యూ & రేటింగ్!

‘సైతాన్’ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!
కుటుంబం కోసం జీవితాన్ని త్యాగం చేసిన స్టార్ హీరోయిన్స్

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus