సమంత… తెలుగు రాష్ట్రాల్లో ఉన్నప్పుడు ఒకలా, పక్క రాష్ట్రాలకు, విదేశాలకు వెళ్లినప్పుడు ఒకలా ఉంటుంది. ఈ మాట మేం అనడం లేదు. ఆమెకు సంబంధించిన ఓ వీడియో వైరల్ అవుతుండే సరికి ఇప్పుడు ఇదే విషయం చర్చనీయాంశంగా మారింది. ఆ వీడియో ఏంటి అనేది మీకు ఇప్పటికే అర్థమైపోయుంటుంది. బెల్ గ్రేడ్‌లోని ఓ పబ్‌లో సమంత చిందులేస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది మీరు చూసే ఉంటారు. ఈ వీడియో వల్ల రెండు విషయాల్లో క్లారిటీ వచ్చింది అంటున్నారు.
లేడీ సూపర్ స్టార్ అంటూ ఫ్యాన్స్ గొప్పగా చెప్పుకునే సమంత… ప్రస్తుతం వరుస షూటింగ్‌లతో బిజీగా గడుపుతోంది. ఓ వైపు సినిమాలు… మరోవైపు వెబ్ సిరీస్‌ల్లో నటిస్తోంది. ప్రస్తుతం రాజ్ – డీకే దర్శకత్వంలో ‘సిటాడెల్’ ఇండియన్ వెర్షన్‌లో నటిస్తోంది. ఈ షూటింగ్ కోసం టీమ్ అంతా సెర్బియాలో ఉంది. అక్కడ బెల్‌గ్రేడ్‌లో దీనికి సంబంధించిన చిత్రీకరణ జరుగుతోంది. ఈ క్రమంలో ఆమె ‘పుష్ప’ సినిమాలోని పాటకు చిందులేసింది.
‘ఊ అంటావా మావా.. ఉ ఊ.. అంటావా మావా..’ అంటూ సమంత (Samantha) స్టెప్పులేస్తున్న వీడియో చూసి… ఇదేంటి మొన్నీమధ్య వరకు మన దగ్గర ఇబ్బందిగా కనిపించిన సమంత మళ్లీ సూపర్ యాక్టివ్ అయిపోయింది.. ఎలాగబ్బా అని అనుకుంటున్నారు. చేతిలో బీరు బాటిల్ పట్టుకుని సమంత స్టెప్పులేస్తుంది… ఇక అంతా ఓకే అయిపోయినట్లేనా అంటున్నారు. ఎందుకంటే గతంలో హైదరాబాద్‌లో తన సినిమాల ప్రచారం సమయంలో సమంత అనారోగ్యంతో ఉన్నట్లు కనిపించింది.
ఆ తర్వాత ముంబయి, లండన్ వెళ్లినప్పుడు యాక్టవ్‌గా కనిపించింది. తిరిగి హైదరాబాద్ వచ్చాక హెల్త్ ఇష్యూస్ ఉన్నట్లుగా కనిపించింది. ఇప్పుడు ఈ డ్యాన్స్‌లు, యాక్టివ్‌నెస్ చూసి సమంత ఫుల్ ఫిట్ అయిపోయిందని, ఇక అనారోగ్యం, ట్రీట్‌మెంట్ వార్తలు రావు అని అంటున్నారు. అయితే గతంలోనూ ఇలానే అనిపించినా, అవ్వలేదు. మరిప్పుడు సమంత ఏం చేస్తుందో చూడాలి. ఆమె త్వరగా కోలుకొని ఫుల్ స్వింగ్‌లో సినిమాలు చేస్తే ఎంత బాగుంటుందో కదా.
టక్కర్ సినిమా రివ్యూ & రేటింగ్!
ప్రేక్షకులను థియేటర్ కు రప్పించిన సినిమాలు ఇవే..!
అత్యధికంగా రెమ్యునరేషన్ తీసుకుంటున్న మ్యూజిక్ డైరెక్టర్లు వీళ్లేనా..!/a>
కలెక్షన్లలో దూసుకుపోతున్న లేడీ ఓరియంటల్ సినిమాలు ఇవే!