వామ్మో వేదికా నువ్వేనా ?

గబుక్కున వేదిక పేరు చెబితే ఎవరికీ గుర్తుకురాదు కానీ.. ‘ముని’ సినిమా హీరోయిన్ అని చెబితే కొందరైనా గుర్తుపట్టగలరేమో. బాల దర్శకత్వంలో వచ్చిన ‘పరదేశి’ చిత్రంలో ఆమె ఆఖరిసారి ప్రేక్షకులను పలకరించింది. ఆ సినిమా సక్సెస్ అవ్వకపోవడంతో ఆమెకు సరైన అవకాశాలు లేకుండాపోయాయి. మరి ఈ విషయంలో ఆమె ఏమైనా హార్ట్ అయ్యిందో లేక ముడుచుకుని కూర్చుంటే వర్కవుటవ్వదని తెలుసుకొందో ఏమో కానీ.. కట్టుబాట్లు పక్కనపెట్టి ట్రెండ్ ఫాలో అవ్వడానికి సిద్ధమైంది.

అందుకే ఒక హాట్ ఫోటోషూట్ చేయించుకొని కుదిరినంతలో అందాలన్నీ ఆరబోసి కెమెరాలకు ఫోజులిచ్చింది. ప్రస్తుతం ఆమె ఫోటోలు ఆన్ లైన్ లో హల్ చల్ చేస్తున్నాయి. మరి వేదిక ఇంత ఓపిగ్గా చేయించుకొన్న ప్రత్యేకమైన ఫోటోషూట్ ఆమె కెరీర్ కు ఏమేరకు ఉపయోగపడుతుంది అనే విషయం పక్కన పెడితే ఆమె అందాలను మాత్రం యువత బాగా ఆస్వాదిస్తున్నారు. అసలే రోజుకో హీరోయిన్ ఇండస్ట్రీకి పరిచయమవుతున్న తరుణంలో వేదిక ఈ విధంగా రీఎంట్రీ కోసం తపిస్తుండడం ఒక విధంగా సత్ఫలితాన్నివ్వదనే చెప్పాలి. కానీ తెలుగుతోపాటు తమిళంలోనూ మంచి కాంటాక్ట్స్ ఉన్న వేదిక వాటిని వాడి ఏమైనా సర్వైవ్ అవ్వడానికి ప్రయత్నిస్తుందా అనేది చూడాలి.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus