“మిర్చి” సినిమాలో టైటిల్ సాంగ్ లో మెరిసినప్పట్నుంచి హంసా నందిని ఇమేజ్ పూర్తిగా మారిపోయింది. అంతకుముందు నుంచీ ఇండస్ట్రీలో ఉండి.. “ఈగ” లాంటి సినిమాలో చిన్న రోల్ చేసినా రాని క్రేజ్ ఆ ఒక్క సాంగ్ తో వచ్చేసింది. అప్పట్నుంచి హంసా నందిని స్పెషల్ సాంగ్ చేస్తే సినిమా సూపర్ హిట్ అనే సెంటిమెంట్ కూడా దర్శకనిర్మాతలకు వచ్చేయడం.. అందుకు తగ్గట్లే ఆమె నటించిన సినిమాలన్నీ సూపర్ హిట్ అవ్వడంతో అందరూ ఆ పద్ధతిని ఫాలో అవ్వడం మొదలెట్టారు.
అయితే.. మెలమెల్లగా హీరోయిన్సే ఐటెమ్ సాంగ్స్ చేసేందుకు అమ్మడికి అవకాశాలు తగ్గుతూ వచ్చాయి. “జైలవకుశ” తర్వాత ఆమె ఇప్పటివరకూ మళ్ళీ తెరపై కనిపించలేదు. దాంతో ఆమె పని అయిపోయిందేమో అనుకున్నారు జనాలు. కానీ.. సడన్ గా నిన్న కొన్ని కొత్త ఫోటోలు ఆన్లైన్ లో వదిలి తాను ఇంకా ఉన్నానని తన ఉనికిని చాటుకొంది హంసానందిని. కొత్త ఫోటోల్లో హంసానందిని హంసలా నడుస్తూ భలే సెక్సీగా ఉంది. మరి ఈ కొత్త ఫోటోలు చూసిన తర్వాత హంసను మన దర్శకనిర్మాతలు తమ సినిమాల్లో ఛాన్స్ ఇస్తారో లేదో చూడాలి.