Vishwambhara: ‘విశ్వంభర’ లేట్‌కి కారణం విజువల్‌ ఎఫెక్ట్స్‌ కాదా? ఇప్పుడు రెడీ అంటే..

చిరంజీవి ప్రధాన పాత్రలో మల్లిడి వశిష్ట దర్శకుడిగా ఓ సినిమా అనేసరికి అందరి దృష్టీ ఈ ప్రాజెక్ట్‌ మీద పడింది. ‘బింబిసార’ లాంటి క్లిష్టమైన సబ్జెక్ట్‌ను బాగా హ్యాండిల్‌ చేయడంతో వశిష్ట మీద నమ్మకంతో చిరంజీవి ‘విశ్వంభర’ సినిమాకు ఓకే చెప్పారు. అంతే నమ్మకంతో సినిమాను పూర్తి చేశారు. అయితే ఇదంతా సినిమా గ్లింప్స్‌ వచ్చేంత వరకే. ఆ గ్లింప్స్‌ చూశాక విమర్శలు మొదలయ్యాయి. సినిమాల వాయిదాలూ మొదలయ్యాయి. ఇప్పటికీ సినిమా విడుదల ఎప్పుడు అనేది తెలియడం లేదు.

Vishwambhara

దీంతో.. విజువల్‌ ఎఫెక్ట్స్‌లో నాణ్యత లేకపోవడం వల్లే ‘విశ్వంభర’ సినిమా ఆలస్యమవుతూ వస్తోంది అని చాలా మంది అనుకున్నారు. అయితే కొంతమంది మాత్రం ‘కారణం వేరే ఉంది’ అని మాట్లాడుకుంటూ వచ్చారు. ఇప్పుడు ఆ కొంత మంది చెప్పిన మాటే నిజమవుతోంది. అవును ‘విశ్వంభర’ సినిమా విడుదల వాయిదాకు కారణం విజువల్‌ ఎఫెక్ట్స్‌ కాదు. తొలి రోజుల్లో ఇదే కారణమైనా.. ఆ తర్వాత అన్నీ ఫిక్స్‌ చేసుకున్నారట. కానీ గ్లింప్స్‌ ప్రభావం వల్ల బిజినెస్‌ అవ్వలేదట.

ఈ సినిమాను తీసుకోవడానికి తొలుత రెడీ అయిన ఓ ఓటీటీ సంస్థ గ్లింప్స్ చూశాక, ఆ తర్వాత జరుగుతున్న పనుల్లో జాప్యం చూశాక వెనక్కి వెళ్లిందట. దీంతో మరో ఓటీటీ డీల్‌ను ఓకే చేయడానికి సినిమా టీమ్‌ ప్లాన్స్‌ చేసింది. ఇప్పుడు ఎట్టకేలకు ఆ డీల్‌ ఓకే అయిందట. దీంతో త్వరలో సినిమా రిలీజ్‌ డేట్‌ని అనౌన్స్‌ చేస్తారని టాక్‌. అయితే ఓటీటీ టీమ్‌ నుండి ఓటీటీ రిలీజ్‌ డేట్‌ వచ్చాక.. థియేట్రికల్‌ రిలీజ్‌ డేట్‌ను టీమ్‌ చెబుతుంది. ఇదేంటి అనుకోకండి.. ఎందుకంటే టాలీవుడ్‌లో ఇప్పటి పరిస్థితి అదే.

సంక్రాంతికి ‘కాకా’ సినిమాను తీసుకురావాలని టీమ్‌ స్ట్రాంగ్‌గా ప్లాన్‌ చేస్తోంది. కాబట్టి ఆ డేట్‌ను ఇచ్చే పరిస్థితి లేదు. ఈ లెక్కన అయితే డిసెంబరు లేదంటే సమ్మర్‌ మాత్రమే ‘విశ్వంభర’ చేతుల్లో ఉన్నాయి. లేదంటే ఏదైనా డిఫరెంట్‌గా థింక్‌ చేసి డేట్‌ ఫిక్స్‌ చేయాలి. ఏం చేస్తారో మరి.

2వ రోజు తగ్గిన ‘ఎపిక్’ కలెక్షన్స్..ఎంతంటే?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus