క్రికెటర్లు – నటులు.. ఈ కాంబినేషన్ ఇప్పటిది కాదు. ఎన్నో ఏళ్లుగా మనం చూస్తూనే ఉన్నాం. అయితే కొందరు బహిరంగంగా చెప్పి ప్రేమలో మునిగి తేలితే.. కొందరు మాత్రం చెప్పకుండా… కనిపించి కనిపించకుండా తిరుగుతూ ఉంటారు. అలా ఓ జంట గురించి గురించి ఇప్పుడు టాలీవుడ్లో, ఐపీఎల్ ఫ్రాంచైజీ పరిధిలో చర్చ నడుస్తోంది. క్రికెట్ మ్యాచ్లు అయినప్పుడు సినిమా, టీవీ తారలు మైదానాలకు రావడం సహజం. అలా ఓ నటి, టీవీ యాంకర్ కూడ వచ్చింది. అయితే కొన్నాళ్ల తర్వా రాలేదు. దాని వెనుక పెద్ద కారణమే ఉంది అంటున్నారు.
సన్ రైజర్స్ హైదరాబాద్లో ఆల్ రౌండర్ వాషింగ్టన్ సుందర్ (Sundar) గురించి తెలిసిందే. ఆడిన తొలి మ్యాచ్ల్లో సరైన ఆట తీరు కనబరకపోయినా.. ఆ తర్వాత ఆల్రౌండర్ ప్రదర్శనతో అదరగొట్టాడు. అనుకోకుండా గాయపడి టోర్నీ నుండి తప్పుకున్నాడు. అలా అతను తప్పుకున్నాడో లేదో ఆ యాంకర్ కమ్ నటి మైదానంలో కనిపించడం మానేసింది. దీంతో ఇద్దరి మధ్య ఏదో ఉంది అంటూ పుకార్లు మొదలయ్యాయి. వాళ్లిద్దరూ ఆఫ్టర్ మ్యాచ్ నగరంలో షికార్లు కూడా కొట్టారు అనేది పుకార్ల సారాంశం. దీంతో ఇప్పుడు ఆమె ఎవరు అనే చర్చ మొదలైంది.
సన్ రైజర్స్ హైదరాబాద్ సొంతమైదానం అయిన ఉప్పల్ గ్రౌండ్లో మ్యాచ్లను చూస్తే.. ఆ యాంకర్ ఎవరు అనేది తెలిసిపోతుంది. నెటిజన్ల లెక్కల ప్రకారం అయితే ఆమె వర్షిణి సౌందరరాజన్ అని అంటున్నారు. తొలుత హైదరాబాద్ మ్యాచ్లకు వచ్చి బాగా ఉత్సాహపరిచిన ఆమె.. సుందర్ టోర్నీ నుండి ఔట్ అయ్యాక మళ్లీ కనిపించలేదు అని చెబుతున్నారు. ఇందులో నిజం ఎంత అనేది తెలియదు కానీ.. ఇద్దరి మధ్య ఏదో ఉంది అనే పుకార్లు మాత్రం తెగ వినిపిస్తున్నాయి.
వర్షిణి నేపథ్యం తమిళనాడు కావడం కూడా ఈ పుకార్లకు మరో కారణం అని అంటున్నారు. సుందర్ తమిళనాడుకు చెందిన ఆటగాడు అనే విషయం తెలిసిందే. ఈ విషయంలో క్లారిటీ కష్టం అనుకోవచ్చు. ఆమె నోరు విప్పాలి.. లేదంటే వచ్చే సీజన్ రావాలి.