సాయి కుమార్ తనయుడు ఆది సాయి కుమార్ డెబ్యూ మూవీ ‘ప్రేమ కావాలి’ అందరికీ గుర్తుండే ఉంటుంది. కె.విజయ భాస్కర్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా 2011 ఫిబ్రవరి 25న రిలీజ్ అయ్యింది. పెద్దగా అంచనాలు లేకుండా అన్ సీజన్లో రిలీజ్ అయిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ గా నిలిచింది. ఈ సినిమాతో ఆది సాయి కుమార్ మాత్రమే కాదు హీరోయిన్ ఈషా చావ్లాకి(Isha Chawla) కూడా డెబ్యూ మూవీ.
ఆమె గ్లామర్, లుక్స్ కూడా ఈ సినిమా సక్సెస్ లో కీలక పాత్ర పోషించింది అని చెప్పాలి. ‘ప్రేమ కావాలి’ తర్వాత ఈషా డిమాండ్ కూడా పెరిగింది. కానీ కథల ఎంపికలో ఆమె సరైన నిర్ణయం తీసుకోలేదు అనేది సినీ విశ్లేషకుల అభిప్రాయం.’ప్రేమ కావాలి’ తర్వాత అదే బ్యానర్లో ‘పూలరంగడు’ అనే సినిమాలో నటించింది. సునీల్ హీరోగా తెరకెక్కిన ఈ సినిమా కూడా హిట్ అయ్యింది. ఆ వెంటనే బాలయ్యతో ‘శ్రీమన్నారాయణ’ కూడా చేసింది.
ఆ సినిమా ప్లాప్ అయ్యింది. కానీ ఈ సినిమాలో బాలయ్యతో లిప్ లాక్ సన్నివేశంలో నటించడం అప్పట్లో హాట్ టాపిక్ అయ్యింది. వాస్తవానికి దాని వల్లే ఈషాకి తర్వాత సరైన ఛాన్సులు రాలేదు. మళ్ళీ సునీల్ తో ‘మిస్టర్ పెళ్లికొడుకు’ చేసినా అల్లరి నరేష్ తో ‘జంప్ జిలానీ’ చేసినా సక్సెస్ దక్కలేదు. అగ్ర హీరోలు, నిర్మాతలు ఈమెను పట్టించుకోలేదు. అయితే కొంత గ్యాప్ తర్వాత ఈమె రీ ఎంట్రీ ఇచ్చింది. ఆ విషయం చాలా మందికి తెలీదు.
నిజమే.. ఇటీవల ‘చీకటిలో’ అనే ఓటీటీ సినిమా వచ్చింది. ఈ సినిమాతో ఈషా చావ్లా రీ ఎంట్రీ ఇచ్చింది. ఆనందిత అనే లేడీ పోలీస్ పాత్రలో ఈషా చావ్లా నటించింది. ఈ సినిమాకి కూడా మిక్స్డ్ రెస్పాన్స్ రావడంతో ఈషా రీ ఎంట్రీ వేస్ట్ అయిపోయినట్టు అయ్యింది. అయితే చిరంజీవి ‘విశ్వంభర’ లో కూడా ఈమె నటిస్తుంది. మరి ఆ సినిమా అయినా ఈషాకి మంచి పేరు తీసుకొస్తుందేమో చూడాలి.