అలాంటి చిత్రాలల్లోనే తను నటించాలనుకుంటుంది : ఇషితా దత్తా

2006లో నందమూరి బాలకృష్ణ హీరోగా వచ్చిన ‘వీరభద్ర’ చిత్రంతో టాలీవుడ్ ప్రేక్షకుల్ని పలకరించింది బాలీవుడ్ నటి ‘తనుశ్రీ దత్తా’. ఈ చిత్రం డిజాస్టర్ గా మిగలడంతో ఈ అమ్మడికి ఇక్కడ పెద్ద అవకాశాలు రాలేదు. దీంతో తిరిగి వెంటనే బాలీవుడ్ కు చెక్కేసింది. అయితే 2010 తర్వాత ఈ అమ్మడు సినిమాలకి బ్రేక్ ఇచ్చి యూఎస్ వెళ్ళిపోయింది. గత సంవత్సరం ఇండియా కి తిరిగొచ్చి ‘మీటూ’ ఉద్యమానికి తెరలేపింది. దీంతో మళ్ళీ అందరి దృష్టి ఆమె పై పడింది. ఇక అదే సమయంలో తనుశ్రీ మళ్ళీ సినిమాల్లో లేదా టీవీ షోలలో కనిపించబోతుందని వార్తలొచ్చాయి.

ఆ వార్తలు అలా ప్రచారమవుతుండగానే ఆమె తిరిగి యూఎస్ వెళ్లిపోయింది. ఇక తనుశ్రీ సహోదరి ఇషితా దత్తా ‘బ్లాంక్’ అనే బాలీవుడ్ చిత్రంలో నటిస్తోంది. తాజాగా ఆమె మీడియాతో మాట్లాడుతూ… “నా సోదరిని తిరిగి సినిమాల్లో చూడాలని ఉంది. ఆమె తిరిగి సినీపరిశ్రమలోకి రావాలని కోరికగా ఉంది. అయితే అది తన ఇష్టం. తనైతే ప్రస్తుతం ఏ ప్రాజెక్టునూ అంగీకరించలేదు. దేనినైనా పూర్తిస్థాయిలో నమ్మాకే తానూ దానిని ప్రారంభిస్తుంది. సమాజానికి ఉపయోగపడే మంచి సినిమాల్లో తానూ నటించాలనుకుంటుంది” అంటూ ఇషితా చెప్పుకొచ్చింది.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus