తమిళంలో బ్లాక్ బస్టర్ హిట్ అయిన ’96’ చిత్రాన్ని తెలుగులో రీమేక్ చేస్తున్న సంగతి తెలిసిందే. శర్వానంద్, సమంత జంటగా నటించిన ఈ చిత్రాన్ని ఒరిజినల్ ను తెరకెక్కించిన సి.ప్రేమ్ కుమారే డైరెక్ట్ చేసాడు. ‘శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్’ బ్యానర్ పై దిల్ రాజు నిర్మించిన ఈ చిత్రం ఫిబ్రవరి 7న విడుదల కాబోతుంది. ఇప్పటికే విడుదల చేసిన టీజర్, ట్రైలర్ లకు డీసెంట్ స్పందన రావడం.. శర్వానంద్, సమంత పెర్ఫార్మన్స్ ల పై నమ్మకం ఉండడంతో ఈ చిత్రానికి మంచి బజ్ ఏర్పడింది. దాంతో బిజినెస్ కూడా బాగా జరిగింది.
ఇక ‘జాను’ ప్రీ రిలీజ్ బిజినెస్ వివరాలు ఈ విధంగా ఉన్నాయి :
నైజాం
5.40 cr
సీడెడ్
2.60 cr
ఉత్తరాంధ్ర
2.20 cr
ఈస్ట్
1.30 cr
వెస్ట్
1.10 cr
కృష్ణా
1.30 cr
గుంటూరు
1.45 cr
నెల్లూరు
0.65 cr
రెస్ట్ ఆఫ్ ఇండియా
3 cr
ఓవర్సీస్
2 cr
వరల్డ్ వైడ్ టోటల్
21cr
‘జాను’ చిత్రానికి 21 కోట్ల బిజినెస్ జరిగింది. ఈ చిత్రం అంతమొత్తం రాబడితేనే క్లీన్ హిట్ అయ్యే అవకాశం ఉంటుంది. అయితే ఫిబ్రవరి మాసం తెలుగు సినిమాలకు పెద్దగా కలిసిరాదు అనే సెంటిమెంట్ ఉంది. ఇక శర్వానంద్ గత రెండు సినిమాలు కూడా నిరాశపరిచాయి. ఈ చిత్రానికి పెద్ద బలం సమంత మరియు నిర్మాత దిల్ రాజు అనే చెప్పాలి. మరి ఈ చిత్రం ఫైనల్ గా ఎంత వరకూ కలెక్ట్ చేస్తుందో చూడాలి.