జబర్దస్త్ కార్యక్రమంలో కమెడియన్లుగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న వర్ష ఇమ్మానియేల్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. వీరిద్దరూ చూడటానికి బ్లాక్ అండ్ వైట్ కాంబినేషన్లో ఉన్నప్పటికీ వీరి ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీ బాగా వర్కౌట్ కావడంతో ఎక్కువగా లవ్ ట్రాక్ స్కిట్ ల ద్వారా ప్రేక్షకులను సందడి చేశారు.కొన్నిసార్లు వీరు చేసే స్కిట్స్ కనుక చూస్తే తప్పకుండా వీరిద్దరు ప్రేమలో ఉన్నారని సంగతి అందరికీ అనుమానాలు వస్తాయి. ఈ విధంగా వీరిద్దరూ జోడిగా జబర్దస్త్ కార్యక్రమంలో సందడి చేస్తూ విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్నారు
అయితే గత కొంతకాలంగా వీరిద్దరూ దూరంగా ఉన్నప్పటికీ తాజాగా జబర్దస్త్ కార్యక్రమం ద్వారా ఈ జంట కలిసిపోయినట్టు తెలుస్తుంది. ఇకపోతే తిరిగి వర్ష తనతో మాట్లాడటంతో ఇమ్మానియేల్ తనకు సర్ప్రైజ్ గిఫ్ట్ ఇచ్చారు. వచ్చే నెలలో వర్ష పుట్టినరోజు ఉండడంతో ఇమ్మానియేల్ తనకు ఖరీదైన బంగారు ఆభరణాలను కొన్నిచ్చినట్టు తెలుస్తోంది. హైదరాబాదులో ఉన్నటువంటి ప్రముఖ నగల దుకాణంలో వర్షకు ఇమ్మానియేల్ ఖరీదైన నక్లెస్ కొనిచ్చారని వర్ష తన యూట్యూబ్ ఛానల్ ద్వారా ఈ విషయాన్ని తెలియజేశారు.
ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇక ఈ వీడియోని చేసిన అనంతరం చివరిలో కేవలం ప్రమోషన్ కోసమే తాను ఇలా చేశామనీ, ఇమ్మానియేల్ ఎలాంటి గిఫ్ట్ కొనివ్వలేదంటూ చివరిలో ట్విస్ట్ ఇచ్చారు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ గా మారింది.ఇకపోతే వీరిద్దరూ జబర్దస్త్ కార్యక్రమంలో మాత్రమే కాకుండా శ్రీదేవి డ్రామా కంపెనీ కార్యక్రమంలో కూడా పెద్ద ఎత్తున సందడి చేస్తూ ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్నారు.
Most Recommended Video
లైక్ షేర్ & సబ్స్క్రైబ్ సినిమా రివ్యూ & రేటింగ్!
బొమ్మ బ్లాక్ బస్టర్ సినిమా రివ్యూ & రేటింగ్!
శిల్పా శెట్టి టు హన్సిక.. వ్యాపారవేత్తలను పెళ్లి చేసుకున్న హీరోయిన్ల లిస్ట్..!