జబర్దస్త్ కమెడియన్ గా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నటువంటి హరి పెద్ద ఎత్తున సోషల్ మీడియాలోనూ ఇతర మీడియా ఛానల్లోనూ వార్తలు వస్తున్న విషయం మనకు తెలిసిందే. అయితే తాజాగా ఈ వార్తలు పై జబర్దస్త్ కమెడియన్ స్పందించారు. పరారీలో ఉన్నట్లు వస్తున్నటువంటి వార్తల స్పందించారు నిజానికి అక్కడ ఉన్నది తాను కాదు అంటూ ఈయన క్లారిటీ ఇచ్చారు. జబర్దస్త్ కమెడియన్ హరి స్మగ్లింగ్ కేసులో పోలీసుల నుంచి తప్పించుకొని పరారీలో ఉన్నారంటూ వార్తలు వస్తున్నాయి.
అయితే ఇక్కడ ఒక చిన్న పొరపాటు జరిగిందని తెలియజేశారు.ఒక వ్యక్తి ఫోటోకి బదులు మరొక వ్యక్తి ఫోటోతో ఇలాంటి వార్తలు రాశారంటూ కమెడియన్ హరి వెల్లడించారు. జబర్దస్త్ కార్యక్రమంలో హరికృష్ణ అనే కమెడియన్ కూడా పనిచేస్తున్నారని తెలియచేశారు. ఇలా గంప హరికృష్ణకు బదులుగా తన ఫోటోలను వేసి పెద్ద ఎత్తున వార్తలు రాస్తున్నారంటూ ఈయన క్లారిటీ ఇచ్చారు.
అయితే ఈ వివాదంలో చిక్కుకున్నది జబర్దస్త్ కార్యక్రమానికి సంబంధించిన మరొక కమెడియన్ హరికృష్ణ అని తాను మాత్రం కాదు అంటూ ఈ సందర్భంగా హరి క్లారిటీ ఇచ్చారు. గంప హరికృష్ణ స్పందించాల్సి ఉంటుందని తెలుస్తుంది. 2013 వ సంవత్సరంలో షకలక శంకర్ టీమ్ లో హరి కృష్ణ పనిచేశారు. ఆ సమయంలో తాను ఎర్రచందనం స్మగ్లింగ్ కేసులో పట్టుబడ్డారు.
అయితే అప్పటికి తాను మంచి ఫామ్ లో ఉండడంతో చాలామంది గూగుల్ సెర్చ్ చేయగా తన ఫోటోలు వచ్చాయి. దీంతో నేనేనని భావించి అందరూ తన ఫోటోలతో స్మగ్లింగ్ కేసులో నేనే చిక్కుకున్నాను అంటూ వార్తలు రాస్తున్నారని హరి వెల్లడించారు. అయితే నాకు ఈ కేసుకు ఎలాంటి సంబంధం లేదంటూ ఈయన చేసినటువంటి ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.