Jabardasth Komaram: ఐదేళ్లు నరకం అనుభవించాను… ఆ కష్టాలు ఎవరికీ రాకూడదు!

Advertisement

జబర్దస్త్ కార్యక్రమం ద్వారా ఎంతో మంది మంచి గుర్తింపు సంపాదించుకున్నారు ఇలా జబర్దస్త్ వేదికపై కొమరక్క గెటప్ ద్వారా ఎంతో మంచి ఆదరణ సంపాదించుకున్నటువంటి వారిలో కమెడియన్ కొమరం ఒకరు. ఈయన తన కట్టు బొట్టు ద్వారా ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకున్నారు. ఇలా ఇండస్ట్రీలో ప్రస్తుతం సినిమా అవకాశాలను అందుకొని ఎంతో బిజీగా గడుపుతున్న కొమరం తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఇంటర్వ్యూ సందర్భంగా ఈయన ఇండస్ట్రీలోకి రాకముందు తన జీవితంలో ఎదుర్కొన్నటువంటి కష్టాల గురించి తెలియజేస్తూ షాకింగ్ కామెంట్స్ చేశారు.

ఈ సందర్భంగా కొమరం పదో తరగతి వరకు మాత్రమే చదువుకున్నానని తెలిపారు. అయితే తాను ఇండస్ట్రీలోకి రాకముందు కోటిలో వస్తువులు అమ్ముకుంటూ బ్రతికే వాడినని అలాగే సిగ్నల్స్ దగ్గర స్కూల్ బ్యాగులు బొమ్మలు అమ్మూతూ బ్రతికే వాడినని తెలిపారు. అలాగే హోటల్ లో పనిచేస్తూ అంట్లు కూడా తోమానని కొమరం తెలియజేశారు. ఇలా ఇండస్ట్రీలోకి రాకముందు తాను బతుకుతెరువు కోసం ఎన్నో కష్టాలు పడ్డారని ఈయన తెలియచేశారు.

ఇలా బుల్లితెరపై అవకాశాలు రావడంతో తనకు ఎంతో మంచి గుర్తింపు వచ్చిందని అయితే సినిమా అవకాశాలు రావడంతోనే తను బుల్లితెర కార్యక్రమాల నుంచి దూరంగా ఉన్నానని కొమరం వెల్లడించారు.ఇక ప్రస్తుతం తాను సినిమాలలో నటిస్తూనే మరోవైపు యూట్యూబ్ ఛానల్ కూడా రన్ చేస్తున్నానని తెలియజేశారు. ఇలా ఇండస్ట్రీలోకి రాకముందు హైదరాబాదులో ఉంటూ ఒక ఐదు సంవత్సరాలు పాటు తాను ఎంతో ఇబ్బందులు ఎదుర్కొన్నానని, ఆ ఐదు సంవత్సరాలు చాలా నరకం అనుభవించానని ఈ సందర్భంగా కొమరం తన కన్నీటి కష్టాలను తెలియజేశారు.

ఇక అలాంటి కష్టాలు ఎవరికి రాకూడదని ఈయన (Komaram) ఆకాంక్షించారు. తాజాగా ఈయన నాని కీర్తి సురేష్ నటించిన దసరా సినిమాలో కూడా నటించారు. ప్రస్తుతం కొమరం చేసినటువంటి ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

హీలీవుడ్‌లో నటించిన 15 మంది ఇండియన్ యాక్టర్స్ వీళ్లే..!
టాలీవుడ్‌లో గుర్తింపు తెచ్చుకున్న 10 మంది కోలీవుడ్ డైరెక్టర్స్ వీళ్లే..!

తు..తు…ఇలా చూడలేకపోతున్నాం అంటూ…బాడీ షేమింగ్ ఎదురుకున్న హీరోయిన్లు వీళ్ళే
నాగ శౌర్య నటించిన గత 10 సినిమాల బాక్సాఫీస్ పెర్ఫార్మన్స్ ఎలా ఉందంటే?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus