నరేష్ వయసు తెలిసి ఆశ్చర్యపోతున్న టీవీ ఆడియన్స్

  • November 4, 2016 / 06:55 AM IST

బుల్లి తెరలో టాప్ రేటింగ్ పొందుతున్న కార్యక్రమాల్లో జబర్దస్త్ ఒకటి. ఈటీవీ లో ప్రసారమవుతున్న ఈ షో తెలుగు ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటోంది. ఇందులో స్కిట్ లు చేసే ఆర్టిస్టుల్లో ప్రతి ఒక్కరికి ఒక ట్యాలెంట్ ఉంటుంది. ముఖ్యంగా బుల్లెట్ భాస్కర్ టీమ్ లో చేసే నరేష్ వేసే పంచ్ లు తప్పకుండా పేలాల్సిందే. అతని టైమింగ్ సూపర్. నరేష్ టోన్ మాత్రం చాలా భిన్నంగా ఉంటుంది. హైట్ తక్కువగా ఉండడం చాలా మందికి మైనస్. ఇతని విషయంలో మాత్రం అదే ప్లస్ అయింది.

చిన్న పిల్లవాడిగా కనిపిస్తూ అడల్ట్ జోకులేసే నరేష్ చిన్నపిల్లాడేమి కాదు. అతను టీనేజ్ లోకి అడుగుపెట్టి ఐదేళ్లు గడిచిపోయింది. ఏంటి నమ్మలేక పోతున్నారా? ఇది నిజం. నరేష్ వయసుని ఓ ఇంటర్వ్యూ లో టీమ్ లీడర్ భాస్కర్ వెల్లడించారు. అతను 17 సంవత్సరాలు నిండిన యువకుడిని చెప్పి టీవీ ఆడియన్స్ ని ఆశ్చర్య పరిచారు. శారీరక పెరుగుదలలో లోపం వల్ల నరేష్ పిల్లోడిగా కనిపిస్తున్నాడని అసలు విషయం చెప్పారు.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus