డీజే టిల్లు (DJ Tillu) తో సూపర్ క్రేజ్ తెచ్చుకున్న సిద్ధు జొన్నలగడ్డ (Siddu Jonnalagadda), బేబి తో (Baby) టాప్ హీరోయిన్ గా మారిన వైష్ణవి చైతన్య (Vaishnavi Chaitanya) జంటగా నటిస్తున్న చిత్రం జాక్ (Jack). కొంచెం క్రాక్ అనేది క్యాప్షన్. బొమ్మరిల్లు భాస్కర్ (Bhaskar) దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాని ఎస్.వి.సి.సి బ్యానర్ పై బాపినీడు, భోగవల్లి ప్రసాద్ (B. V. S. N. Prasad) లు నిర్మిస్తున్నారు. ఈ సినిమా ఫస్ట్ లుక్, టైటిల్ వంటి వాటికి మంచి రెస్పాన్స్ వచ్చింది. కొద్దిసేపటి క్రితం టీజర్ ను కూడా వదిలారు.
ఈ టీజర్ విషయానికి వస్తే ఇది.. 1:28 నిమిషాల నిడివి కలిగి ఉంది. ఇది కూడా డీజె టిల్లు స్టైల్ లో మొదలైంది. కొడుకు ఏం పని చేస్తున్నాడో తెలీని తండ్రి పాబ్లో నెరూడ అనే సమస్యతో బాధపడుతున్నట్టు చెడుతాడు. ఆ వెంటనే ‘ మీ నాన్నకే తెలియనంత గలీజ్ జాబ్ ఏం చేస్తున్నావు నువ్వు ‘ అంటూ హీరోయిన్ వైష్ణవి చైతన్య ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత హీరో సిద్ధు జొన్నలగడ్డ బైకులు కొట్టేస్తూ, పర్సులు కొట్టేస్తూ కనిపిస్తున్నాడు.
అదంతా పార్ట్ టైమ్ జాబ్ అని చెబుతూ.. టక్ చేసుకుంటే ఏం చేస్తున్నావు అని ఎవరూ అడగరు అంటూ కామిడీ చేశాడు. ఆ తర్వాత ఫైట్లు వంటివి చేస్తున్నాడు. హీరోని మిస్టీరియస్ గా చూపిస్తూ దర్శకుడు బొమ్మరిల్లు భాస్కర్ గట్టిగా ఏదో ప్లాన్ చేసినట్లు అనిపిస్తుంది. టీజర్ ను మీరు కూడా ఒకసారి చూడండి: