Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Television » Guppedantha Manasu September 8th: కొడుకు పెళ్లికి అతిథులుగా జగతి మహేంద్ర!

Guppedantha Manasu September 8th: కొడుకు పెళ్లికి అతిథులుగా జగతి మహేంద్ర!

  • September 8, 2023 / 01:03 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Guppedantha Manasu September 8th: కొడుకు పెళ్లికి అతిథులుగా జగతి మహేంద్ర!

బుల్లితెర ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటూ రోజురోజుకు ఎంతో మంచి ఆదరణ పొందుతున్నటువంటి గుప్పెడంత మనసు సీరియల్ ఈరోజు మరింత ఆసక్తికరంగా మారింది. మరి నేటి ఎపిసోడ్ లో భాగంగా ఈ సీరియల్ లో ఏం జరిగిందనే విషయానికి వస్తే… రిషి పెళ్లికి ఒప్పుకున్నారన్న సంతోషంలో ఏంజెల్ ఉంటుంది అయితే అదే సమయంలోనే విశ్వనాథం కి కూడా గుండెపోటు రావడంతో ఇప్పుడు చెప్పడం మంచిది కాదని అక్కడి నుంచి వెళ్ళిపోతారు. మరోవైపు రిషి పెళ్లికి ఒప్పుకోవడంతో ఏంజెల్ సంతోషపడుతూ వసుధారకు ఫోన్ చేస్తుంది.

వసుధార మనం రిషిని పెళ్లి గురించి ఎంత అడిగినా ఒప్పుకోలేదు కదా కానీ విశ్వం అడిగితే పెళ్లికి ఒప్పుకున్నారు. రిషితో నా పెళ్లి జరగబోతుంది అంటూ సంతోషంగా చెప్పడంతో ఒక్కసారిగా వసుధార షాక్ అవుతుంది. ఇలా ఫోన్ కట్ చేసిన వసుధార స్పృహ తప్పి కింద పడబోతూ ఉండగా అదే సమయంలో అక్కడికి వచ్చినటువంటి రీషి తనని పట్టుకొని అనంతరం తన మొహాన నీళ్లు చల్లి తనని లేపుతారు. ఏం జరిగింది అనడంతో మీరు ఏంజెల్ ను పెళ్లి చేసుకోబోతున్నారా అంటూ వసుధార అడగగా రిషి సమాధానం చెబుతూ.. ఆ మాటలను మీరు నమ్మారా? నేను పూర్తిగా సమాధానం చెప్పేలోపు వాళ్లు నేను పెళ్ళికి ఒప్పుకున్నానని ఆనందపడిపోతున్నారు. ఇప్పుడు ఆయన ఆరోగ్యం ఏమైపోతుందోనని కంగారుగా ఉంది. అయినా ఇదంతా నీ వల్లే జరిగింది అంటూ మరోసారి వసుధారపై రిషి సీరియస్ అవుతారు.

నా గురించి నువ్వు ఏంజెల్ కు అర్థం అయ్యేలా చెప్పకుండా తనని ఎంకరేజ్ చేశావు అదే ఇలాంటి పరిణామాలకు కారణమయ్యింది అంటూ రిషి కోప్పడుతూ అక్కడ నుంచి వెళ్లిపోతారు. అదే సమయంలోనే వసుధారకు ఏంజెల్ ఫోన్ చేయగా వసుధార ఫోన్ లిఫ్ట్ చేయకపోవడంతో ఏం జరిగిందోనని కంగారుగా ఏంజెల్ అక్కడికి బయలుదేరుతూ ఉండగా విశ్వనాథం వచ్చి ఏం జరిగి ఉండదు సంతోషంతో తాను ఇక్కడికి బయలుదేరి వస్తుంటుంది అని చెప్పడంతో ఏంజెల్ ఆగిపోతుంది. మరోవైపు మహేంద్ర జగతి దంపతులు మనీ విషయం గురించి ఆలోచిస్తూ ఉంటారు అంతలోపే విశ్వనాథం ఫోన్ చేసి రిషి, ఏంజెల్ వివాహం కుదిరింది త్వరలోనే నిశ్చితార్థం రిషికి తల్లిదండ్రులు లేరు ఆయన ఎవరో చెప్పడం లేదు అందుకే మీరు తన ఆత్మీయులు కదా తల్లిదండ్రుల స్థానంలో ఉండాలి అంటూ విశ్వనాథం వారిని ఇన్వైట్ చేస్తారు.

ఈ విధంగా ఏంజెల్ రిషి పెళ్లి గురించి విన్నటువంటి జగతి మహేంద్ర షాక్ అవుతారు. రిషి అక్కడే ఉన్నారా అనడంతో లేరు తను బయటకు వెళ్లారు అని చెప్పగా సరేనని మహేంద్ర ఫోన్ పెట్టేస్తారు అసలు ఏం జరుగుతుంది జగతి అక్కడ రిషి ఏంజెల్ పెళ్లి చేసుకోవడమేంటి అంటూ కంగారుగా మహేంద్ర ఫోన్ చేస్తే రిషి లిఫ్ట్ చేయరు. తర్వాత వసుధరకు ఫోన్ చేయగా లిఫ్ట్ చేయదు అక్కడ ఏదో జరుగుతుంది రిషి ఏదో ఇబ్బందుల్లో ఉన్నారు మనం వెంటనే వెళ్లి తన ప్రాబ్లం సాల్వ్ చేయాలి అని మాట్లాడుతూ ఉంటారు ఈ మాటలు విన్నటువంటి శైలేంద్ర మీరు వెళ్లి మీ సమస్య సాల్వ్ చేసుకోండి మీరు వచ్చేలోపు నా సమస్య నేను సాల్వ్ చేసుకుంటానని అనుకుంటారు.

వసుధార ఏడుస్తూ కూర్చునే ఉండగా ఇంటి బయట వసుధారని చూస్తూ రిషి నిలబడి ఉంటారు. అయితే తలుపు వేయడానికి వచ్చినటువంటి చక్రపాణి చూసి తనని లోపలికి రమ్మని పిలవలేను అంటూ ఒకవైపు కూతురు మరోవైపు రిషి బాధపడటం చూసి ఇబ్బంది పడతారు. వసుధార వద్దకు వచ్చి బయట అల్లుడుగారు ఉన్నారు లోపలికి రమ్మని పిలవన అంటూ వసుధారతో చెప్పడంతో వసుధార బయటకు వెళ్లి చూడగా అంతలోపే రిషి కారులో వెళ్లిపోతారు. తన మనసులో నేను ఉన్నాను అయినప్పటికీ తలుపులు మూసేసి కూర్చున్నారు ఆ తలుపులు తెరిచి నేనెప్పుడూ తన మనసులోకి వెళ్ళేది అంటూ వసుధార బాధపడుతూ వెనకనే బైక్ పై రిషి ఎప్పుడు కూర్చునేది దగ్గరికి వెళ్తుంది.

అక్కడికి వెళ్లినటువంటి వసుధారతో రిషి మాట్లాడుతూ నాకేంటి ఈ టార్చర్ నా జీవితం అంతా ఇలాగే బాధలతోనే గడపాల అంటూ బాధపడతారు. ఇలా మాట్లాడటంతో వసుధార ఓదార్చే ప్రయత్నం చేయగా అంతలోపు విశ్వం ఫోన్ చేస్తారు. మీకేం మీరు బయట నుంచి మాటలు బాగా మాట్లాడుతారు కానీ నాకు ఈ టార్చర్ ఏంటి అంటూ విశ్వనాథం ఫోన్ చేయడం చూపిస్తారు మీరు ఫోన్ లిఫ్ట్ చేయండి సార్ అనగా నేను చేయను అని దృశ్యం మాట్లాడతారు మరి వారు కంగారు పడతారు చేయండి అనడంతో ఫోన్ లిఫ్ట్ చేసినటువంటి రిషి విశ్వనాథం మాట్లాడుతూ ఎక్కడున్నావు రిషి త్వరగా ఇంటికి రా అనడంతో నేను రాను అంటూ మాట్లాడుతారు. నాకు ఇంకా పని పూర్తి అవ్వలేదు సార్ అంటూ రిషి మరీ కూల్ గా మాట్లాడటంతో నీకోసం ఏంజెల్ స్వీట్ చేసింది త్వరగా ఇంటికి రా రిషి అంటూ ఫోన్ పెట్టేస్తారు ఇంతటితో ఈ ఎపిసోడ్ (Guppedantha Manasu) పూర్తి అవుతుంది.

జవాన్ సినిమా రివ్యూ & రేటింగ్!

మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి సినిమా రివ్యూ & రేటింగ్!
‘బిగ్ బాస్ 7’ 14 మంది కంటెస్టెంట్స్ పారితోషికాల లిస్ట్..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Television Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Guppedantha Manasu

Also Read

Venky Kudumula: రాబిన్ హుడ్ డిజాస్టర్ రిజల్ట్ పై స్పందించిన దర్శకుడు వెంకీ కుడుముల

Venky Kudumula: రాబిన్ హుడ్ డిజాస్టర్ రిజల్ట్ పై స్పందించిన దర్శకుడు వెంకీ కుడుముల

OTT: ఈ వీకెండ్..కి ఓటీటీల్లో ఏకంగా 35 సినిమాలు/సిరీస్ సందడి!

OTT: ఈ వీకెండ్..కి ఓటీటీల్లో ఏకంగా 35 సినిమాలు/సిరీస్ సందడి!

Kaagitham Padavalu Review in Telugu: కాగితం పడవలు సినిమా రివ్యూ & రేటింగ్!

Kaagitham Padavalu Review in Telugu: కాగితం పడవలు సినిమా రివ్యూ & రేటింగ్!

Srikanth Odela: ‘దసరా’ తర్వాత శ్రీకాంత్‌ ఓదెల రియాక్షన్‌.. ఎవరూ నమ్మనట్లుగా..

Srikanth Odela: ‘దసరా’ తర్వాత శ్రీకాంత్‌ ఓదెల రియాక్షన్‌.. ఎవరూ నమ్మనట్లుగా..

Sardar 2 Collections: ఎదురీదుతున్న ‘సర్దార్ 2’.. ఎంత కలెక్ట్ చేసిందంటే?

Sardar 2 Collections: ఎదురీదుతున్న ‘సర్దార్ 2’.. ఎంత కలెక్ట్ చేసిందంటే?

Irumudi Collections: 26వ రోజు కూడా కోటి గ్రాస్.. మరోసారి ‘ఇరుముడి’ భీభత్సం

Irumudi Collections: 26వ రోజు కూడా కోటి గ్రాస్.. మరోసారి ‘ఇరుముడి’ భీభత్సం

related news

రెండో బిడ్డకి జన్మనిచ్చిన స్టార్ కపుల్

రెండో బిడ్డకి జన్మనిచ్చిన స్టార్ కపుల్

Venky Kudumula: రాబిన్ హుడ్ డిజాస్టర్ రిజల్ట్ పై స్పందించిన దర్శకుడు వెంకీ కుడుముల

Venky Kudumula: రాబిన్ హుడ్ డిజాస్టర్ రిజల్ట్ పై స్పందించిన దర్శకుడు వెంకీ కుడుముల

OTT: ఈ వీకెండ్..కి ఓటీటీల్లో ఏకంగా 35 సినిమాలు/సిరీస్ సందడి!

OTT: ఈ వీకెండ్..కి ఓటీటీల్లో ఏకంగా 35 సినిమాలు/సిరీస్ సందడి!

Nani: ‘ప్యారడైజ్‌’ గురించి నాని మాటలు వింటుంటే.. ఏదో తేడాగా ఉందే..

Nani: ‘ప్యారడైజ్‌’ గురించి నాని మాటలు వింటుంటే.. ఏదో తేడాగా ఉందే..

Kaaka: ‘కాకా’ భార్య ఎవరు? ‘కాకా’ వచ్చేది ఎప్పుడు? క్లారిటీ ఇచ్చేస్తారా?

Kaaka: ‘కాకా’ భార్య ఎవరు? ‘కాకా’ వచ్చేది ఎప్పుడు? క్లారిటీ ఇచ్చేస్తారా?

Kaagitham Padavalu Review in Telugu: కాగితం పడవలు సినిమా రివ్యూ & రేటింగ్!

Kaagitham Padavalu Review in Telugu: కాగితం పడవలు సినిమా రివ్యూ & రేటింగ్!

trending news

Venky Kudumula: రాబిన్ హుడ్ డిజాస్టర్ రిజల్ట్ పై స్పందించిన దర్శకుడు వెంకీ కుడుముల

Venky Kudumula: రాబిన్ హుడ్ డిజాస్టర్ రిజల్ట్ పై స్పందించిన దర్శకుడు వెంకీ కుడుముల

21 hours ago
OTT: ఈ వీకెండ్..కి ఓటీటీల్లో ఏకంగా 35 సినిమాలు/సిరీస్ సందడి!

OTT: ఈ వీకెండ్..కి ఓటీటీల్లో ఏకంగా 35 సినిమాలు/సిరీస్ సందడి!

21 hours ago
Kaagitham Padavalu Review in Telugu: కాగితం పడవలు సినిమా రివ్యూ & రేటింగ్!

Kaagitham Padavalu Review in Telugu: కాగితం పడవలు సినిమా రివ్యూ & రేటింగ్!

2 days ago
Srikanth Odela: ‘దసరా’ తర్వాత శ్రీకాంత్‌ ఓదెల రియాక్షన్‌.. ఎవరూ నమ్మనట్లుగా..

Srikanth Odela: ‘దసరా’ తర్వాత శ్రీకాంత్‌ ఓదెల రియాక్షన్‌.. ఎవరూ నమ్మనట్లుగా..

2 days ago
Sardar 2 Collections: ఎదురీదుతున్న ‘సర్దార్ 2’.. ఎంత కలెక్ట్ చేసిందంటే?

Sardar 2 Collections: ఎదురీదుతున్న ‘సర్దార్ 2’.. ఎంత కలెక్ట్ చేసిందంటే?

3 days ago

latest news

Raaka: ఒక్క ‘37’లో ఇన్ని అర్థాలు ఉన్నాయా? బన్నీ – అట్లీ మేనియాకి సిద్ధమా?

Raaka: ఒక్క ‘37’లో ఇన్ని అర్థాలు ఉన్నాయా? బన్నీ – అట్లీ మేనియాకి సిద్ధమా?

2 days ago
Dhruva Natchathiram: ‘ధృవనక్షత్రం’కి డబ్బులు పెట్టే వ్యక్తి దొరికారట.. ఈసారైనా వస్తుందా?

Dhruva Natchathiram: ‘ధృవనక్షత్రం’కి డబ్బులు పెట్టే వ్యక్తి దొరికారట.. ఈసారైనా వస్తుందా?

2 days ago
తమిళంలోకి ఎంట్రీ ఇస్తున్న చిరంజీవి మేనల్లుళ్ల హీరోయిన్‌

తమిళంలోకి ఎంట్రీ ఇస్తున్న చిరంజీవి మేనల్లుళ్ల హీరోయిన్‌

2 days ago
The Paradise: ఆ లక్ష మంది ఇప్పుడు ‘జడలతో’ థియేటర్లకు వస్తారా?

The Paradise: ఆ లక్ష మంది ఇప్పుడు ‘జడలతో’ థియేటర్లకు వస్తారా?

2 days ago
Karthikeya: ‘RX 100’ కార్తికేయ మళ్లీ వస్తున్నాడు.. హీరోగా కాదు.. విలన్‌గా కాదు

Karthikeya: ‘RX 100’ కార్తికేయ మళ్లీ వస్తున్నాడు.. హీరోగా కాదు.. విలన్‌గా కాదు

3 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version