మరోసారి లీకు బారిన పడిన ఎన్టీఆర్ జై లవకుశ మూవీ!

  • July 31, 2017 / 01:32 PM IST

టెంపర్, నాన్నకు ప్రేమతో, జనతా గ్యారేజ్.. మూడు విభిన్నమైన కథల్లో కొత్తగా నటించి ఎన్టీఆర్ హ్యాట్రిక్ హిట్ అందుకున్నారు. ఇప్పుడు ఒకే సినిమాలో మూడు వైవిధ్యమైన పాత్రల్లో నటిస్తున్నారు. అందుకే బాబీ దర్శకత్వంలో తారక్ నటిస్తున్న జై లవ కుశ సినిమాపై భారీ క్రేజ్ నెలకొని ఉంది. దీనికి ఎన్ని జాగ్రత్తలు తీసుకున్న లీకుల బెడద తప్పడం లేదు. కొన్ని రోజులక్రితం ఈ చిత్ర టీజర్ అధికారికంగా రిలీజ్ కాకముందే సోషల్ మీడియాలో ప్రత్యక్షమయింది. వీడియో లీక్ చేసిన గణేశ్‌ అనే వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. ఈ కేసు ఇంకా విచారణ కొనసాగుతూనే ఉంది. ఇంతలో మరో లీక్ జరిగింది. ఇప్పుడు పాట లీకయింది.

రాక్ స్టార్ దేవీ శ్రీ ప్రసాద్ జై లవకుశ లోని జై పాత్రకు ‘రావణ..’ అనే పాటను ఎంతో పవర్ ఫుల్ గా కంపోజ్ చేశారు.  ఈ పాట ప్రస్తుతం సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఈ లీక్ దెబ్బకి వెంటనే అప్రమత్తమైన చిత్ర బృందం రావణ సాంగ్ వైరల్ కాకుండా చర్యలు తీసుకుంటోంది. అదే విధంగా లీక్ చేసిన వ్యక్తి కనిపెట్టేపనిలో పడింది.  మరో సారి లీక్ కాకుండా గట్టి చర్యలు చేపడుతోంది. ఎన్టీఆర్‌ ఆర్ట్స్‌ పతాకంపై కల్యాణ్‌రామ్‌ నిర్మిస్తున్న ఈ సినిమాలో నివేత థామస్, రాశీ ఖన్నా, నందితారాజ్ లు హీరోయిన్స్ గా నటిస్తున్నారు. ప్రస్తుతం పూణేలో చిత్రీకరణ జరుపుకుంటున్న జై లవ కుశ  సెప్టెంబర్ 21 న రిలీజ్ కానుంది.


Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus