Jailer 2: ‘జైలర్‌ 2’ ఎవరి చేతిలోకి.. టాలీవుడ్‌లో రంగంలోకి రెండు పెద్ద సంస్థలు

నిన్న మొన్నటి వరకు ఆ సినిమా గురించి అందరూ ‘వాయిదా’ మాటలే మాట్లాడుకున్నారు. ఈ సినిమా చెప్పిన టైమ్‌కి రాకపోవచ్చు.. కొత్త డేట్‌ ఇవ్వొచ్చు అనే చెప్పుకుంటూ వచ్చారు. అయితే ఇప్పడు మొత్తం పరిస్థితి మారిపోయింది. ‘మేం చెప్పిన డేట్‌కే వస్తాం’ అని టీమ్‌ కరాఖండిగా చెప్పడంతో ఇప్పుడు అందరి చూపు ఈ సినిమా మీదే పడింది. ఈ క్రమంలో తెలుగులో ఈ సినిమాను ఎవరు రిలీజ్‌ చేస్తారు అనే విషయంలో ఓ చర్చ మొదలైంది.

Jailer 2

రజనీకాంత్‌ ప్రధాన పాత్రలో నెల్సన్‌ దిలీప్‌ కుమార్‌ తెరకెక్కించిన సినిమా ‘జైలర్‌ 2’. మూడేళ్ల క్రితం వచ్చి బ్లాక్‌బస్టర్‌ విజయం అందుకున్న ‘జైలర్‌’ సినిమాకు సీక్వెల్‌ రూపొందిన ఈ సినిమాను అక్టోబరు 15న విడుదల చేస్తున్నారు. తెలుగులో ఆ రోజున ఈ సినిమా థియేటర్లకు తెచ్చేది ఎవరు అనేదే లేటెస్ట్‌ చర్చ. దీని కోసం టాలీవుడ్‌లో ఇద్దరు అగ్ర నిర్మాతలు రెడీ అవుతున్నారట. దీని కోసం పెద్ద మొత్తం ఇవ్వడానికి రెడీ అవుతున్నాయి.

‘జైలర్‌’ సినిమాకు సుమారు రూ.600 కోట్ల వసూళ్లు వచ్చిన నేపథ్యంలో రెండో సినిమాకు కూడా టీమ్‌ అంతకుమించి ఎక్స్‌పెక్ట్‌ చేస్తోంది. ఈ క్రమంలో తెలుగు వరకు నిర్మాణ సంస్థ సన్‌ పిక్చర్స్‌ రూ.50 కోట్ల నుండి రూ.60 కోట్ల వరకు తీసుకోవాలని అనుకుంటోందట. అయితే తెలుగు నిర్మాతలు గరిష్ఠంగా రూ.45 కోట్లు ఇవ్వడానికి రెడీగా ఉన్నారు అని సమాచారం. మరో నిర్మాత రూ.35 కోట్ల వరకు సిద్ధంగా ఉన్నారట.

పెద్ద మొత్తంగా ఇవ్వడానికి సిద్ధంగా ఉన్న నిర్మాత సితార నాగవంశీ కాగా.. చిన్న మొత్తం ఇవ్వడానికి రెడీగా ఉన్న నిర్మాత దిల్‌ రాజు అని చెబుతున్నారు. త్వరలోనే ఈ విషయంలో తేలి తెలుగులో ప్రచారం షురూ చేస్తారు. ఒకవేళ నాగవంశీ ఈ సినిమా హక్కలు పొందితే నైజాంలో సినిమాను రిలీజ్‌ చేసేది మళ్లీ దిల్‌ రాజునే అవ్వొచ్చు.

దీపావళికి అదిరిపోయే క్లాష్‌ రెడీ చేసిన 3 సినిమాలు

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus