Jana Nayakudu Twitter Review: ‘జన నాయకుడు’ ట్విట్టర్ రివ్యూ!

దళపతి విజయ్ ఇప్పుడు సీఎం విజయ్ (Vijay) అయ్యారు. సినిమాల్లో తిరుగులేని స్టార్ గా రాణించారు. ఆయన హీరోగా నటించిన చివరి సినిమా ‘జన నాయగన్’ (Jana Nayakudu). ఈ ఏడాది సంక్రాంతికే రిలీజ్ కావాల్సిన ఈ సినిమా అనేక వివాదాలు, సెన్సార్ సమస్యలు వంటి వాటి కారణంగా వాయిదా పడింది. ఒక దశలో సినిమా పైరసీకి గురవ్వడం కూడా జరిగింది. విజయ్ సీఎం అయ్యాక కూడా ఈ సినిమా సాఫీగా రిలీజ్ అయ్యింది లేదు. రివైజింగ్ కమిటీకి వెళ్లి.. క్లియరెన్స్ తెచ్చుకుని మొత్తానికి అన్ని అడ్డంకులను జయించి ఫైనల్ గా జూలై 23న విడుదల కాబోతోంది.

Jana Nayakudu/Jana Nayagan

విజయ్ నటించిన ఆఖరి సినిమా సెంటిమెంట్ తో ఈ సినిమాకి మంచి క్రేజ్ ఏర్పడింది. దీంతో ప్రమోషన్ వంటివి లేకుండానే సినిమాని రిలీజ్ చేస్తున్నారు. ఆల్రెడీ కొన్ని చోట్ల షోలు పడ్డాయి. సినిమా చూసిన వారు ట్విట్టర్ ద్వారా తమ అభిప్రాయాలు వ్యక్తపరుస్తున్నారు. వారి టాక్ ప్రకారం…’జన నాయకుడు’ (Jana Nayakudu)సినిమా రన్ టైం 3 గంటలు ఉందట. ఫస్ట్ హాఫ్ చాలా వరకు ‘భగవంత్ కేసరి’ నే తలపిస్తుందట. అయినప్పటికీ విజయ్, మామితా బైజు పెర్ఫార్మన్స్ ఆకట్టుకునే విధంగా ఉంటాయని అంటున్నారు.

పూజా హెగ్డే గ్లామర్ కూడా సినిమాకి స్పెషల్ అట్రాక్షన్ అయ్యిందంటున్నారు. బాబీ డియోల్ విలనిజం మాత్రం ప్రత్యేకంగా ఉంటుందట. ‘భగవంత్ కేసరి’ తో పోలిస్తే విలన్ ట్రాక్ ను దర్శకుడు హెచ్ వినోద్ సెపరేట్ గా డిజైన్ చేసుకున్నాడని అంటున్నారు. అలాగే విజయ్ (Vijay) పొలిటికల్ కెరీర్ కి ఉపయోగపడేలా పొలిటికల్ అంశాలు కూడా జతచేసినట్టు చెబుతున్నారు. చూడాలి మరి మార్నింగ్ షోల నుండి ఎలాంటి రెస్పాన్స్ వస్తుందో..!

 

 

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus
Tags