హిట్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ చేసిన చిత్రం జనతా గ్యారేజ్ టాలీవుడ్ లోని రికార్డులను తిరగ రాస్తోంది. ప్రపంచవ్యాప్తంగా సెప్టెంబర్ 1న గ్రాండ్ గా విడుదలైన ఈ సినిమా కలక్షన్ల వర్షం కురిపిస్తోంది. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించిన ఈ ఫిల్మ్ కి రెండు తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా కర్ణాటక, కేరళ, విదేశాల్లోనూ మంచి ఆదరణ లభిస్తోంది. మంచి కథ, తారక్ , మోహన్ లాల్ నటన, సమంత, నిత్యా మీనన్, కాజల్ అందాలు, దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం, కొరటాల దర్శకత్వ ప్రతిభ ఈ సినిమాను టాలీవుడ్ టాప్ గ్రాసర్ జాబితాలో చేర్చింది. జనతా గ్యారేజ్ 30 రోజులకు (సెప్టెంబర్ 30) ప్రపంచవ్యాప్తంగా 135.20 కోట్ల గ్రాస్ రాబట్టింది. షేర్ కూడా ఘనంగానే ఉంది. 84 కోట్లు షేర్ దక్కించుకొని లాభాలను పంచి పెడుతోంది. ఈ శుక్రవారం వరకు జనతా గ్యారేజ్ కలక్షన్స్ కి బ్రేక్ వేసే సినిమా లేదు, కాబట్టి ఈ మూవీ 150 కోట్ల వసూలు చేస్తుందని ట్రేడ్ వర్గాలవారు అంచనా వేస్తున్నారు.
ఏరియాల వారీగా కలక్షన్స్ (షేర్)
వైజాగ్ – 7.6
గుంటూరు – 6.15
ఈస్ట్ గోదావరి – 5
వెస్ట్ గోదావరి – 4.7
కృష్ణా – 4.45
నెల్లూరు – 2.26
నైజాం – 19.1
సీడెడ్ – 11.8
తెలుగు రాష్ట్రాల్లో మొత్తం 61.06
కర్ణాటక – 8.69
కేరళ – 1.78
తమిళనాడు – 1.20
ఇతర రాష్ట్రాల్లో – 1.45
యుఎస్ఏ – 7.4
ఇతర దేశాల్లో – 2.38
ప్రపంచవ్యాప్తంగా షేర్ : 83.96 కోట్లు