విదేశాల్లో జనతా గ్యారేజ్’ దూకుడు

  • September 6, 2016 / 12:21 PM IST

యంగ్ టైగర్ ఎన్టీఆర్ మరో సారి తన సత్తా చాటారు. కొరటాల శివ దర్శకత్వంలో ఆయన నటించిన “జనతా గ్యారేజ్” తెలుగు రాష్ట్రాలతో పాటు విదేశాల్లోనూ కలక్షన్ల వర్షం కురిపిస్తోంది. ఈ నెల 1వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమాకు బంద్ ఏ మాత్రం అడ్డుకాలేదు. వరుసగా మూడు రోజులు సెలవులు రావడంతో అత్యంత వేగంగా 50 కోట్ల క్లబ్ లో చేరింది. విదేశాల్లో ఫస్టు వీకెండులో ఈ సినిమా 9.51 కోట్లను రాబట్టింది. తారక్ తన మార్క్ యాక్షన్ ను వదిలిపెట్టకుండా వినూత్న కథ తో చేసిన ప్రయత్నం మంచి ఫలితాలని ఇస్తోందని చిత్ర బృందం ఆనందం వ్యక్తం చేస్తోంది.

కొరటాల శివ, ఎన్టీఆర్ హిట్ కాంబినేషన్  కి తోడు మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ నటన ఈ సినిమాకు ప్లస్ అయిందని వెల్లడించింది. సమంతా – నిత్యామీనన్ ల గ్లామర్ తో పాటు కాజల్ అగర్వాల్ స్పెషల్ సాంగ్ మాస్, క్లాస్ తేడా లేకుండా అందరిని థియేటర్ కు రప్పిస్తోందని వివరించింది. త్వరలోనే ఈ మూవీ 100 కోట్ల మార్క్ ని రీచ్ అవుతుందని భావిస్తోంది. జనతా గ్యారేజ్ అన్ని రికార్డులను రిపేర్ చేయడం ఖాయమని నందమూరి అభిమానులు ధీమాగా చెబుతున్నారు.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus