విడుదలకు ముందే ఎన్టీఆర్ సెన్సేషన్!!!

  • June 22, 2016 / 02:43 PM IST

యంగ్ టైగర్ ఎన్టీఆర్ మంచి దూకుడు మీద ఉన్నాడు. గత ఏడాది టెంపర్ చిత్రంతో టాలీవుడ్ కు సూపర్ డూపర్ మాస్ హిట్ ను అందించిన మన హీరో, ఈ ఏడాది నాన్నకు ప్రేమతో అంటూ క్లాస్ టచ్ ఇచ్చి బాక్స్ ఆఫీస్ ను షేక్ చేశాడు. అయితే అదే క్రమంలో మూడో సినిమా హిట్ ఇచ్చి హ్యాట్రిక్ కొట్టాలనే ఆలోచనలో ఉన్న ఎన్టీఆర్ ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో “జనతా గ్యారేజ్” లో బిజీగా ఉన్నాడు.

ఇదిలా ఉంటే తాజాగా ఇండస్ట్రీలో ట్రెండ్ మారడంతో అందరి ఆశలు…ఆలోచనలు ఎన్టీఆర్ సినిమా పై పడ్డాయి. గతంలో సినిమా విడుదల తరువాత జరిగే బిజినెస్ మాత్రమే లెక్కల్లోకి వచ్చేది. కానీ ఇప్పుడు ట్రెండ్ పూర్తిగా మారిపోయింది…సినిమా రిలీస్ కు ముందే సూపర్ బిజినెస్ జరిగిపోతుంది. ఈ అలవాటు మన జక్కన్న తీసిన బాహుబలి నుంచి ఎక్కువగా మారింది. అయితే సినిమా విడుదల తరువాత బిజినెస్ ఎలా ఉంటే ముందే సినిమా సేఫ్ జోన్ లోకి వెళ్ళిపోతుంది.

అదే క్రమంలో ఇప్పుడు ఎన్టీఆర్ సినిమా విషయానికి వస్తే….ఇప్పటికీ ఈ సినిమాకు విపరీతమైన క్రేజ్ పెరిగిపోవడం, అందులోనూ మళయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ సైతం నటించడం, అన్నీ వెరసి..ఈ సినిమాకు రిలీజ్ కి ముందే 62 కోట్లకు పైగా బిజినెస్ తెచ్చిపెట్టి సంచలనాలకు కేర్ ఆఫ్ అడ్రెస్ అయ్యాయి. మరి విడుదలకు ముందే ఇన్ని సంచలనాలు సృష్టిస్తున్న ఈ సినిమా ఆగస్టు 12న భారీ స్థాయిలో రిలీజ్ కాబోతుంది…విడుదల తరువాత ఇంకా ఎలాంటి రికార్డ్స్ ను తన ఖాతాలో వేసుకుంటుందో చూడాలి.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus