ప్రేమను ఆరాధనగా… ప్రేయసిని హృదయదేవతగా భావించి, విరహాన్ని సైతం సంగీతంగా మలిచిన మధురమైన ప్రేమగీతం ‘వెంకటలక్ష్మి రావే’.
“వెంకటలచ్చిమి రావే… హృదయలచ్చిమి రావే… విరహలచ్చిమి రావే… విలాస్యలచ్చిమి రావే… ప్రేమలచ్చిమి రావే… ఈ పార్థు లచ్చిమి రావే…” అంటూ అమ్మవారిని వివిధ నామాలతో స్తుతించినట్లుగా, తన ప్రేయసిని ప్రేమ, విరహం, ఆరాధనలతో వర్ణించడం ఈ పాట ప్రత్యేకత.
మరో విశేషం పదాల పదనిసలు!
“అలసి… సొలసి… వలచి… వగచి… వేగంగా… రాగంగా… సాగంగా… నా గంగా… చేరంగా… చూడంగా… ఈ గంగా…” అంటూ ప్రేమికుడి ఆరాటాన్ని, “గతిని… చితిని… మతిని… స్థితిని… అతిని… గతిని…” అంటూ అతని మనోగతాన్ని లయబద్ధమైన పదప్రయోగాలతో అద్భుతంగా ఆవిష్కరించారు గేయ రచయిత, దర్శకుడు రామమూర్తి కొట్టాల (BFA).
పదాల్లో ప్రాస… ప్రాసల్లో లయ… లయలో ప్రేమ… ప్రేమలో విరహం! ఇలా సాహిత్య సౌందర్యానికి సి.ఎన్. ఆదిత్య మధురమైన స్వరాలు తోడై ఈ పాటను ఒక సంగీత ప్రేమకావ్యంగా మలిచాయి.
టింట్‌స్ప్రీ స్టూడియోస్ పతాకంపై అలేటి రాజేష్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో రఘు గద్వాల్, ప్రియాంక శ్రీ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. భువన్ విక్రమాదిత్య కొట్టాల సినిమాటోగ్రఫీ, ప్రదీప్ కుమార్ రెడ్డి ఎడిటింగ్, సురేష్ మండల (BFA) ఆర్ట్ డైరెక్షన్, వినయ్ మాస్టర్, మణికంఠ మాస్టర్ కొరియోగ్రఫీ, రిషి DI బాధ్యతలు నిర్వహించారు. మధుర ఆడియో ద్వారా చిత్ర సంగీతం ప్రేక్షకులకు చేరువవుతోంది.
ప్రేమ, సంగీతం, మానసిక సంఘర్షణ, ఊహించని మలుపులతో రూపొందిన ఈ సైకలాజికల్ సస్పెన్స్ మ్యూజికల్ లవ్ థ్రిల్లర్ త్వరలో థియేటర్లలో ప్రేక్షకులను అలరించనుంది.
‘వెంకటలక్ష్మితో ఏడాది కిందట’ — పాటలో మధురమైన ప్రేమ… కథలో అంతుచిక్కని రహస్యం!