Janhvi Kapoor: నిర్మాతలకు జాన్వీ అలాంటి షరతులు విధిస్తోందా?

టాలీవుడ్ ఇండస్ట్రీలో జాన్వీ కపూర్ ఎంట్రీ గురించి ఇప్పటికే ఎన్నో కథనాలు ప్రచారంలోకి వచ్చాయి. జాన్వీ కపూర్ సైతం తనకు తెలుగు సినిమాలపై ఆసక్తి ఉందని పలు సందర్బాల్లో వెల్లడించిన సంగతి తెలిసిందే. అయితే ఎన్టీఆర్30 సినిమాతో జాన్వీ కపూర్ టాలీవుడ్ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇస్తున్నారు. అయితే జాన్వీ కపూర్ నిర్మాతలకు షాకింగ్ కండీషన్లు పెడుతున్నారని సమాచారం అందుతోంది.
జాన్వీ కపూర్ షరతులు విన్న నిర్మాతలు ఈమెతో సినిమాలు తీయడం తేలిక కాదని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నట్టు సమాచారం అందుతోంది.

తెలుగు సినిమాలకు భారీగానే రెమ్యునరేషన్ ను డిమాండ్ చేస్తున్న ఈ బ్యూటీ ఎడిటింగ్ లో తన సీన్లను కట్ చేయకూడదని షరతు విధిస్తున్నారని తెలుస్తోంది. తాను సినిమాకు ఓకే చెప్పిన తర్వాత స్క్రిప్ట్ లో కానీ, క్యారెక్టర్ లో కానీ మార్పులు చెప్పకూడదని ఆమె చెబుతున్నారని బోగట్టా. స్టార్ హీరోయిన్లను మించి జాన్వీ కపూర్ షరతులు విధిస్తున్నారని తెలుస్తోంది. జాన్వీ కపూర్ షరతులు విన్న నిర్మాతలు ఆమెతో సినిమా తీసే విషయంలో ఒకటికి రెండుసార్లు ఆలోచిస్తున్నట్టు సమాచారం.

మరి ఈ షరతులకు ఒప్పుకుని సినిమాలను తీసే నిర్మాతలు ఉంటారా? అనే ప్రశ్నలు సైతం వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం. జాన్వీ కపూర్ ఒక్కో సినిమాకు 4 కోట్ల రూపాయల రేంజ్ లో రెమ్యునరేషన్ ను తీసుకుంటున్నారు. ఎన్టీఆర్ సినిమాతో ఎంట్రీ ఇస్తే జాన్వీ కపూర్ రేంజ్ మారిపోతుందని జాన్వీ కపూర్ స్టార్ హీరోయిన్ స్టేటస్ ను సొంతం చేసుకోవడం ఖాయమని కొంతమంది చెబుతున్నారు. రాబోయే రోజుల్లో ఏం జరుగుతుందో చూడాల్సి ఉంది.

జాన్వీ కపూర్ కెరీర్ విషయంలో తప్పటడుగులు పడకుండా జాగ్రత్తలు తీసుకుంటూనే సినిమాలను ఎంపిక చేసుకోవాల్సి ఉంది. జాన్వీ కపూర్ కెరీర్ పరంగా మరిన్ని విజయాలను సొంతం చేసుకోవాలని అభిమానులు భావిస్తున్నారు.

బటర్ ఫ్లై సినిమా రివ్యూ& రేటింగ్!
2022లో అలరించిన తెలుగు సినిమాలు ఇవే!

ఇప్పటవరకూ ఎవరు చూడని శ్రీలీల రేర్ ఫోటో గ్యాలరీ!!
‘ఖుషి’ పవన్ ఫ్యాన్స్ కు ఒక డ్రగ్ లాంటిది..రీ రిలీజ్ లో ఎందుకు చూడాలి అంటే..?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus