తమిళ స్టార్ హీరో కార్తీ హీరోగా నటించిన ‘జపాన్’ సినిమా ఈ నెల 10న ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. రాజు మురుగున్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో కార్తీ సరసన అను ఇమ్యాన్యుయేల్ నటించారు. సునీల్, విజయ్ మిల్టన్, కేఎస్ రవికుమార్ తదితరులు కీలక పాత్రల్లో నటించారు. అయితే, భారీ అంచనాల నడుమ విడుదలైన ‘జపాన్’ సినిమా ఆ అంచనాలను అందుకోలేకపోయింది. బాక్సాఫీస్ వద్ద వెనకడుగు వేసింది. విమర్శకులనుంచే కాదు.. ప్రేక్షకుల నుంచి కూడా మిశ్రమ స్పందన వచ్చింది.
మొదటి రోజు కలెక్షన్ల పరంగా పర్లేదు అనిపించినా.. మౌత్ పబ్లిసిటీ ద్వారా కలెక్షన్లను గండిపడింది. రోజు రోజుకు సినిమా కలెక్షన్లు తగ్గుతూ వస్తున్నాయి. జపాన్ విడుదలైన రోజే.. జిగిర్తాండ డబుల్ ఎక్స్ సినిమా కూడా రిలీజ్ అవ్వటం జపాన్ కలెక్షన్లకు గండి కొట్టింది. జపాన్ మొదటి రోజు వసూళ్లు కేవలం 10 కోట్లకే పరిమితం అయ్యాయి. ఇక, సినిమా ఓటీటీ రిలీజ్కు సంబంధించి ఓటీటీ ప్లాట్ ఫామ్ ఇప్పటికే ఫిక్స్ అయింది. ప్రముఖ ఓటీటీ సంస్థ చాలా రోజుల క్రితమే జపాన్ స్ట్రీమింగ్ హక్కుల్ని సొంతం చేసుకుంది.
ఇది ఇలా ఉండగా ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్ ని అన్నీ ప్రాంతీయ భాషలకు కలిపి నెట్ ఫ్లిక్స్ సంస్థ భారీ రేట్ కి కొనుగోలు చేసింది. విడుదలైన 50 రోజుల తర్వాత స్ట్రీమింగ్ చెయ్యాలి అనేది అగ్రిమెంట్. కానీ సినిమాకి ఫ్లాప్ టాక్ వచ్చింది, ఇంకో రెండు రోజులు దాటితే షేర్ వసూళ్లు రావడం కూడా ఆగిపోతాయి, అందుకే నెట్ ఫ్లిక్స్ సంస్థ ఈ నెలలోనే సినిమాని స్ట్రీమింగ్ చేసుకునే అవకాశం ఇప్పిస్తే ముందు అనుకున్న రేట్ కి డబుల్ ఇస్తామని ఆఫర్ చేసారు.
సినిమాకి ఎలాగో నష్టం వస్తుంది, అందులో ఎలాంటి సందేహం లేదు, కనీసం ఈ డీల్ అయినా ఒప్పుకుంటే ఎంతో కొంత నష్టం పుడుతుంది అని, ఈ నెలలోనే ఓటీటీ స్ట్రీమింగ్ కి ఒప్పుకున్నట్టు సమాచారం. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన కూడా త్వరలోనే రానుంది. థియేటర్లలో అంతగా రాణించలేకపోయినా.. ఓటీటీలో మాత్రం రాణిస్తుందన్న ఆశతో ఉన్నారు ఫ్యాన్స్. కొన్ని సినిమాలు థియేటర్లలో సరిగా ఆడకపోయినా.. ఓటీటీలో సూపర్ సక్సెస్ అయ్యాయి. ఈ చిత్రం (Japan) కూడా ఆ బాటలోనే నడస్తుందని ఫ్యాన్స్ ఆశా భావం వ్యక్తం చేస్తున్నారు.