“అమ్మ” చివరి మాటలు ఇవే!!!

తమిళ ప్రజల ఆరాధ్య దైవం, ‘అమ్మ’ అనే ఆప్యాయతకి నిలువెత్తు రూపం అయితే తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత మరణం అకస్మాత్తుగా రావడంతో ఇప్పటికీ ఆమె మరణాన్ని జీర్ణించుకోలేక పోతున్నారు తమిళ ప్రజలు….ఆమెను అభిమానించే వారైతే ఇది కలేమొ అన్న కలలో ఉన్నారు అనే చెప్పాలి….అయితే ఆమె మృతి చెంది దాదాపుగా వారం పైనే అవుతున్నప్పటికీ ఆమె ఆసుపత్రిలో దాదాపుగా 75రోజుల పాట్లు చికిత్స చేయించుకున్నారు అన్న సంగతి ఇప్పటికీ ఎవ్వరూ మరచిపోలేకపోతున్నారు…అయితే ఆమె భౌతికంగా దూరం కావడంతో ఆమెతో గడిపిన ఆ చివరి రోజులను అపోలో డాక్టర్స్ స్మరించుకుంటూ కన్నీరు మున్నీరు అవుతున్నారు…చివరి రోజుల్లో జయ ఎలా ఉండే వారు…తమిళ నాట రాజకీయ అపార చానక్యులను శాసించిన జయ హాస్పిటల్ లో చివరి రోజుల్లో జరిగిన కొన్ని సంఘటనలను ఆ ఆసుపత్రి వర్గాలు ఇలా చెబుతున్నాయి….

దాదాపుగా 16మంది నర్సులు మూడు షిఫ్ట్స్ గా విడిపోయి, తలో 8గంటలు ఆమెకు చికిత్స అందించడంతో, వారి షిఫ్ట్స్, వారి పేర్లు గుర్తుంచుకుని మరీ వారి కోసం ఎదురు చూసే వారట జయ…అంతేకాదు, వారందరినీ ‘కింగ్ కాంగ్’ అని ఏడిపీంచేవారట జయ.

ఇక ఆరోగ్యానికి సంభందించిన వ్యాయామాలు, సైతం చాలా కస్టపడి చేసేవారట, ‘నువ్వు చెప్పు నేను చేస్తా’ అనే వారే కానీ, ఇప్పుడూ ముఖ్యమంత్రి అన్న గర్వాన్ని ఎక్కడా చూపించలేదు అని తెలిపారు కొందరు నర్సులు. అంతేకాదు, జయది చాలా జాలి గుణం అని, ఆమె తినడానికి ముందే ఎదుటివారికి పెట్టే మంచి మనసు జయది అని తెలిపారు ఆమెను ట్రీట్ చేసిన నర్సులు. కొన్ని సార్లు డాక్టర్స్ చెయ్యమనే చెప్పే ఎక్సర్సైసస్ చాలా కష్టమైనవి, క్లిష్టమైనవి అని ఆమెకు అనిపించినప్పటికీ ఎప్పుడు కాదు, వద్దు అని మాత్రం అనేవారు కాదట. అయితే మరీ ఇబ్బంది అనిపిస్తే కాసేపు ఆగి చేద్దాం అని చెప్పేవారని ఆసుపత్రి వర్గాలు చెబుతున్నాయి.

ఇక భోజన సమయంలో కూడా, చాలా యాక్టివ్ గా, చలాకీగా, ప్రతీ ముద్దని, ఒక్కో నర్స్ పేరు చెబుతూ….అదే అమ్మ ఇది అమ్మ ముద్ద, ఇది నాన్న ముద్ద అంటూ పెడుతుందిగా అలా అనుకుంటూ, ఆటపట్టిస్తూ తినేవారని తెలుస్తుంది.

ట్రీట్‌మెంట్ కోసం ఆసుపత్రిలో చేరిన ఆమె అక్కడ డాక్టర్స్ కి, నర్స్ లకి ఎన్నో సలహాలు ఇచ్చేవారట, స్కిన్ గురించి, జుట్టు గురించి, తనకు తెలిసిన సలహాలు అందిస్తూ అందరినీ ఆటపట్టిస్తూ ఉండేవారట.

ఒకరోజైతే, మీరంతా నా ఇంటికి రండి మీకు మంచి కోడైనాడు టీ చేయించి ఇస్తాను అంటూ అక్కడ ఉన్న వారికి తెలిపారని అక్కడి డాక్టర్స్ చెబుతున్నారు.

అన్నింటికన్నా గుర్తు ఉండి పోయే సంఘటన ఒకటి ఉంది, ఒక రోజు, ఒక డాక్టర్ కాస్త కోపంగా, పెద్ద గొంతుతో, నర్స్ లపై తన పవర్ ను చూపించే క్రమంలో ఆమె మాట్లాడలేని పరిస్తితుల్లో ఉన్నప్పటికీ ఆ డాక్టర్ చెవులో అందరికీ వినిపించేలాగా…”కాదు ఇక్కడ నేనే బాస్”అంటూ అనగానే అందరూ ఒక్కసారిగా నవ్వుల్లో మునిగిపోయారట.

ఇలా అందరినీ నవ్విస్తూ, ఆట పట్టిస్తూ, ఉన్న అమ్మ ఒక్కసారిగా గుండె నొప్పితో కుప్పకూలి పోవడంతో ఒక్కసారిగా కొన్ని కోట్ల మంచి అభిమానులు కన్నీటిలో మునిగి పోయారు అనే చెప్పాలి.

Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus
Tags