Jayam Ravi: ఆమె దూరం.. తొలిసారి రియాక్ట్ అయిన జయం రవి.. ఏమన్నాడంటే?
- May 16, 2026 / 06:24 PM ISTByFilmy Focus Desk
‘నేను ఇక భరించలేను.. అన్నీ వదిలేసి వెళ్లిపోతుననా.. అతన్ని మీకే ఇచ్చేస్తున్నా’ అంటూ ప్రముఖ సింగర్ కెనీషా తన లైఫ్ గురించి క్లారిటీ ఇచ్చిన నేపథ్యంలో.. జయం రవి ప్రెస్ మీట్ పెట్టారు. తాను ఎన్నో రోజులుగా సహనంతో ఉంటున్నానని.. వ్యక్తిగత విషయాల ఎక్కడా మాట్లాడలేదని కానీ ఇప్పుడు మాట్లాడాల్సిన సమయం వచ్చిందంటూ తన మనో వేదనను బయట పెట్టాడు జయం రవి. పిల్లలను కూడా తనకు దూరం చేశారని జయం రవి కన్నీరు పెట్టుకున్నారు.
Jayam Ravi
ఇంతకాలం నా వ్యక్తిగత జీవితం గురించి ఎవరితోనూ షేర్ చేసుకోనందుకు క్షమించండి. ఇప్పుడు చెప్పాల్సి వచ్చి చెబుతున్నాను. విడాకులు వచ్చే వరకూ నా సినిమాలు ఏవీ విడుదల కావు. అప్పటి వరకూ నేను కూడా నటించను. నాకు జరిగిన అవమానాలు ఇక భరించడం నా వల్ల కాదు. నన్ను ఇబ్బంది పెట్టాలని చూసేవారు ఆపే వరకూ నేను నటించను. కానీ రోజూ ఆఫీసులోనే ఉంటాను. రండి.. ఎంతగా ఇబ్బంది పెడదాం అనుకుంటున్నారో పెట్టండి అని క్లారిటీ ఇచ్చేశాడు.

అసలు నాకు విడాకులు వస్తాయా.. రావా అనే విషయాన్ని పక్కన పెడితే నాపై జరుగుతున్న ట్రోలింగ్ నన్ను బాధ పెడుతోంది. నా కెరీర్‌లో 95 శాతం సినిమాలు హిట్ అయ్యాయి. ఎంతో కష్టపడి ఈ స్థాయికి వచ్చాను. మహిళల హక్కుల కోసం ఎన్నో పోరాటాలు చేశాను. అలాంటి నా పై నిందలు వేస్తున్నారు అని ఆవేదన వ్యక్తం చేశారు. నా పిల్లలకు మంచి భవిష్యత్తు ఉండాలని లక్షల రూపాయలు పెట్టి చదివించాను అని చెప్పారు. ఏకంగా నాకు వారిపై ప్రేమ లేదని రాసేస్తున్నారు అని బాధపడ్డారు.
నాపై జరిగిన ట్రోలింగ్ కారణంగానే నా స్నేహితురాలు కెనీషాను కోల్పోయాను. ఆమె కూడా ఎన్నో వేధింపులు ఎదుర్కొంది. దీని గురించి ఆమె సోషల్ మీడియాలో రాసుకొచ్చారు. సినిమా పరిశ్రమకు, అతడిని ప్రేమించే వారికి, సమర్థించే వారితో పాటు అతడి జీవితంపై వారికి మాత్రమే హక్కులు ఉన్నాయనుకునే వారికి నేను చెప్పేది ఒక్కటే.. ‘అతడు ఇక పూర్తిగా మీవాడే’ అని రాశారు. నేను ఓడిపోయాను. చెన్నై వదిలి వెళ్లిపోతున్నాను. నా సంగీతాన్ని, నా థెరపీని, నా జీవితానికి సంబంధించిన ప్రతిదాన్ని వదిలేస్తున్నాను అని రాశారు.













