నాని సినిమా హిట్టయ్యింది.. కానీ..?

‘సితార ఎంటర్టైన్మెంట్స్’ బ్యానర్ పై సూర్యదేవర నాగ వంశీ నిర్మాణంలో ‘మళ్ళీ రావా’ ఫేమ్ గౌతమ్ తిన్ననూరి డైరెక్షన్లో వచ్చిన చిత్రం ‘జెర్సీ’. నేచురల్ స్టార్ నాని హీరోగా నటించిన ఈ చిత్రంలో శ్రద్దా శ్రీనాథ్ హీరోయిన్ గా నటించింది. అనిరుధ్ సంగీతమందించిన ఈ చిత్రం వరుసగా రెండు ప్లాపులతో సతమవుతున్న నానికి మంచి రిలీఫ్ ఇచ్చింది. ఇక ప్రపంచ వ్యాప్తంగా ఈ చిత్రం 28.10 కోట్ల షేర్ ను రాబట్టింది.

ఇక ‘జెర్సీ’ చిత్రం ఏరియా వైజ్ క్లోజింగ్ కలెక్షన్ల వివరాలు ఈ విధంగా ఉన్నాయి :

నైజాం – 9.55 కోట్లు
వైజాగ్ – 2.75 కోట్లు
సీడెడ్ – 2.10 కోట్లు


ఈస్ట్ – 1.50 కోట్లు
కృష్ణా – 1.60 కోట్లు
గుంటూరు – 1.60 కోట్లు
వెస్ట్ – 1.10 కోట్లు
నెల్లూరు – 0.70 కోట్లు


————————————————
ఏపీ + తెలంగాణ – 20.90 కోట్లు
రెస్ట్ అఫ్
ఇండియా – 2.65 కోట్లు
ఓవర్సీస్ – 4.55 కోట్లు(కరెక్టడ్)


————————————————-
వరల్డ్ వైడ్ టోటల్ – 28.10 కోట్లు (షేర్)
————————————————–

‘జెర్సీ’ చిత్రానికి 26 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది.ఈ చిత్రం మొత్తంగా 28.10 కోట్ల షేర్ ను రాబట్టింది. ఈ చిత్రం బ్రేక్ ఈవెన్ అయ్యింది. అయితే కొన్ని ఏరియాల్లో ‘జెర్సీ’ చిత్రానికి కొద్ది మొత్తంలో నష్టాలు వచ్చాయి. ఈ చిత్రానికి లారెన్స్ ‘కాంచన3’ చిత్రం ఎఫెక్ట్ గట్టిగానే పడింది. ఆ చిత్రం బి, సి సెంటర్స్ లో ‘జెర్సీ’ ని పెద్ద దెబ్బే కొట్టింది. ఇక రెండో వారం విడుదలైన ‘ఎవెంజర్స్ ది ఎండ్ గేమ్’ చిత్రం రావడంతో మల్టీ ప్లెక్సుల్లో కూడా దెబ్బ పడింది. లేకపోతే ‘జెర్సీ’ చిత్రం మరింతగా కలెక్ట్ చేసేది అనడంలో సందేహం లేదు. ఏదేమైనా ఈ చిత్రం నాని ని ప్లాపుల నుండీ మాత్రం బయటకి వచ్చింది.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus