హాలీవుడ్ టాప్ హీరోను బీట్ చేసిన జాన్వి కపూర్!

“పుత్రోత్సాహము తండ్రికి పుత్రుడు జన్మించినపుడు కాదు …..జనులా పుత్రుని కనుగొని పొగడంగ నాడు కలుగును సుమతీ” అనే పద్యంలోని పరమార్ధాన్ని ప్రతిఒక్కరూ ఏదో ఒక దశలో ఆస్వాదిస్తూనే ఉంటారు. కానీ.. తాను కన్న కోటి కలలు ఫలించి వెండితెరపై ప్రభలే తరుణానికి ఈ ప్రపంచాన్ని విడిచి వెళ్ళిపోయిన శ్రీదేవి ఆశయాన్ని ఆమె కుమార్తె నిజం చేసి చూపించింది. పాపం ఆ విజయాన్ని చూసి ఆనందించడానికి శ్రీదేవి ఈ భూమిపై లేదనే బాధ మినహాయిస్తే.. “ధడక్” బృందం సినిమా సక్సెస్ ను పూర్తిస్థాయిలో ఎంజాయ్ చేస్తున్నారు.

ఇక్కడ పేర్కొనదగ్గ ఇంకో విశేషం ఏంటంటే.. నిన్నమొన్నటివరకూ హాలీవుడ్ సినిమాలు బాలీవుడ్ ను డామినేట్ చేయగా.. ఈ ఫ్రైడే మాత్రం “ధడక్” హాలీవుడ్ ఫిలిమ్ “స్కై స్క్రేపర్”ను భీభత్సంగా డామినేట్ చేసి.. ఆ సినిమాకి రెండింతలు కలెక్షన్స్ ను వసూలు చేసింది. తొలివారంలో 33.67 కోట్ల రూపాయలు వసూలు చేసిన “ధడక్” సూపర్ హిట్ చిత్రంగా నిలిచింది. ఈ చిత్రం ఓవరాల్ గా 50 కోట్ల రూపాయలు వసూలు చేయడం ఖాయమని ట్రేడ్ ఎనలిస్ట్ లు అంచనా వేస్తుండగా.. సినిమాలో శ్రీదేవి కుమార్తె జాన్వి కపూర్ నటనకు విశేషమైన స్పందన లభించడం అనేది బోణీకపూర్ కుటుంబాన్ని ఎక్కడలేని ఆనందాన్ని తెచ్చిపెడుతోంది.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus