తల్లి శ్రీదేవి ఆలోచనలు వృధాకాలేదు. కూతురు జాన్వీ కోసం ఎంచుకున్న కథ గురితప్పలేదు. మరాఠీలో తెరకెక్కిన సైరత్ మూవీ సూపర్ హిట్ సాధించింది. ఆ ప్రేమ కథతో తన కుమార్తె జాన్వీ హీరోయిన్ గా ఎంట్రీ ఇస్తే తిరుగుండదని శ్రీదేవి అలోచించి ఒకే చెప్పింది. శశాంక్ ఖైతాన్ దర్శకత్వంలో ధడక్ గా రూపుదిద్దుకున్న ఈ చిత్రం నిన్న థియేటర్లోకి వచ్చింది. సామాన్య ప్రేక్షకులతో పాటు సెలబ్రిటీలకు ఈ చిత్రం బాగా నచ్చింది. ముఖ్యంగా జాన్వీ నటన హైలెట్ అయింది. తొలి సినిమాలోనే పరిణితి చెందిన నటిగా నటించి ప్రసంశలు అందుకుంటోంది. దీంతో ఆమె పారితోషికంపై చర్చ మొదలయింది. జాన్వీ కపూర్ అరవై లక్షల రూపాయల పారితోషికం అందుకున్నట్టు బాలీవుడ్ వర్గాలు తెలిపాయి. తొలి సినిమాకి ఇంత తీసుకోవడం విశేషమని చెప్పాలి.
హీరోగా నటించిన ఇషాన్ ఖట్టర్‌కు కూడా అరవై లక్షలు ఇచ్చినట్లు వెల్లడించాయి. అయితే వీరిద్దరి కంటే అధికంగా జాన్వీ తండ్రిగా ఈ సినిమాలో నటించిన అశుతోష్ రాణాకు 80 లక్షలకు ఇచ్చారని సమాచారం. దర్శకుడు శశాంక్ కూడా బాగానే అందుకున్నట్టు తెలిసింది. డైరక్టర్ 4 కోట్లు.. రచయిత నాగరాజ్ కు రెండు కోట్లు తీసుకున్నట్లు ప్రచారం సాగుతోంది. ఒరిజినల్ చిత్రానికి సంగీతం అందించిన అజయ్, అతుల్ ద్వయం ధడక్ కి సంగీతం అందించారు. వారి సంగీతంతో ప్రాణం పోశారు. వారు 1.5 కోట్ల పారితోషికం అందుకున్నట్లు బాలీవుడ్ వర్గాలు వెల్లడించాయి.