Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movies » ‘జిగర్ తండా డబుల్ ఎక్స్’ మూవీ టీజర్ | రాఘవ లారెన్స్, ఎస్.జె.సూర్య

‘జిగర్ తండా డబుల్ ఎక్స్’ మూవీ టీజర్ | రాఘవ లారెన్స్, ఎస్.జె.సూర్య

  • September 11, 2023 / 02:32 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

‘జిగర్ తండా డబుల్ ఎక్స్’ మూవీ టీజర్ | రాఘవ లారెన్స్, ఎస్.జె.సూర్య

సూపర్‌స్టార్ మహేష్ చేతుల మీదుగా విడుదలైన ‘జిగర్ తండా డబుల్ ఎక్స్’ మూవీ టీజర్….తమిళంలో ధనుష్, మలయాళంలో దుల్కర్ సల్మాన్, కన్నడలో రక్షిత్ శెట్టి చేతుల మీదుగా టీజర్ రిలీజ్.. దీపావళికి గ్రాండ్ రిలీజ్‌కి సిద్ధం చేస్తోన్ననిర్మాణ సంస్థ స్టోన్ బెంచ్ ఫిలింస్

ద‌ర్శ‌క నిర్మాత కార్తీక్ సుబ్బ‌రాజ్ డైరెక్ష‌న్‌లో స్టోన్ బెంచ్ ఫిలిమ్స్ బ్యాన‌ర్‌పై కార్తికేయ‌న్ నిర్మిస్తోన్న చిత్రం ‘జిగ‌ర్ తండా డ‌బుల్ ఎక్స్‌’. రాఘ‌వ లారెన్స్‌, ఎస్‌.జె.సూర్య ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు.  హై యాక్ష‌న్ డ్రామాగా తెర‌కెక్కుతోంది. సోమవారం ఈ సినిమా టీజర్‌ను సూపర్ స్టార్ మహేష్ రిలీజ్ చేసి చిత్ర యూనిట్‌కి అభినందనలు తెలియజేశారు. తెలుగు టీజర్‌ను మహేష్ విడుదల చేయగా తమిళ టీజర్‌ను ధనుష్, కన్నడ టీజర్‌ను రక్షిత్ శెట్టి, మలయాళ టీజర్‌ను దుల్కర్ సల్మాన్ రిలీజ్ చేశారు. అన్ని భాషల్లో టీజర్‌కు అమేజింగ్ రెస్పాన్స్ వస్తోంది.

ఇప్పటికే చిత్రీకరణను పూర్తి చేసుకున్న ఈ సినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలను పూర్తి చేసుకునే పనిలో ఉంది. దీపావళికి సినిమాను ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ చేయటానికి ఎంటైర్ టీమ్ అహర్నిశలు కష్టపడుతోంది.

తమిళనాడు, కేరళల్లో బ్యూటీఫుల్ లొకేషన్స్‌తో పాటు భారీ సెట్స్ వేసి సినిమా చిత్రీకరించారు. ఈ సందర్బంగా నిర్మాత కార్తికేయన్ సంతానం మాట్లాడుతూ ‘‘‘జిగర్ తండా డబుల్ ఎక్స్’ సినిమాను మా బ్యానర్‌లో చాలా ప్రెస్టీజియస్‌గా నిర్మించాం. మేకింగ్‌లో ఎక్కడా కాంప్రమైజ్ కాలేదు. ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్నాయి. ఈ ఏడాది దీపావళికి సినిమాను వరల్డ్ వైడ్ గ్రాండ్ రిలీజ్ చేయటానికి సన్నాహాలు చేస్తున్నాం’’ అన్నారు.

డైరెక్టర్ కార్తీక్ సుబ్బరాజ్ మాట్లాడుతూ ‘‘డిఫరెంట్ కాన్సెప్ట్‌తో ‘జిగర్ తండా డబుల్ ఎక్స్’ను తెరకెక్కించాం. ఆడియెన్స్‌కి ఓ అమేజింగ్ ఎక్స్‌పీరియెన్స్ దొరుకుతుంది. ఈ సినిమాకు వర్క్ చేసిన నటీనటులు, సాంకేతిక నిపుణుల సహకారంతో అనుకున్న సమయంలో పూర్తి చేశాం. సపోర్ట్ చేసిన అందరికీ ధన్యవాదాలు’’ అన్నారు.

యాక్షన్ డ్రామాగా రూపొందుతోన్న్ (Jigarthanda Double X) ‘జిగర్ తండా డబుల్ ఎక్స్’ బాహు భాషా చిత్రంగా దీపావళికి రిలీజ్ కానుంది. 2014 బ్లాక్ బస్టర్ అయిన జిగర్ తండా సినిమాకు ఇది ప్రీక్వెల్. అనౌన్స్‌మెంట్ రోజు నుంచి సినిమాపై భారీ అంచనాలు క్రియేట్ అయ్యాయి. నాటి జిగర్ తండా స్టైల్లోనే దీన్ని యాక్షన్ గ్యాంగ్ స్టర్ జోనర్‌లోనే కార్తీక్ సుబ్బరాజ్ తెరకెక్కిస్తున్నారు. జాతీయ అవార్డ్ సినిమాటోగ్రాఫర్ తిరు ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీని అందిస్తున్నారు. మెర్క్యురీ, రజినీకాంత్ పేట్ట చిత్రాల తర్వాత కార్తీక్ సుబ్బరాజ్, తిరు కాంబోలో వస్తోన్న సినిమా ఇది. జిగర్ తండా సినిమాకు సంగీతాన్ని అందించిన సంతోష్ నారాయణన్ ఇప్పుడు ‘జిగర్ తండా డబుల్ ఎక్స్’కు సంగీత సారథ్యం వహిస్తున్నారు. షఫిక్ మొహమద్ అలీ ఎడిటింగ్ బాధ్యతలను నిర్వహిస్తున్నారు.

జిగర్ తండా తరహాలో ‘జిగర్ తండా డబుల్ ఎక్స్’ కూడా ట్రెండ్ సెట్టర్ అవుతుందని ఎంటైర్ టీమ్ చాలా కాన్ఫిడెన్స్‌తో ఉంది. ఆసక్తిని రేపే ట్విస్టులు, థ్రిల్లింగ్ ఎలిమెంట్స్‌తో కార్తీక్ సుబ్బరాజ్ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారు. కార్తికేయన్ సంతానం ఈ సినిమా నిర్మిస్తున్నారు. సినిమా ప్రపంచ వ్యాప్తంగా దీపావళికి భారీ ఎత్తున విడుదలవుతుంది.

జవాన్ సినిమా రివ్యూ & రేటింగ్!

మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి సినిమా రివ్యూ & రేటింగ్!
‘బిగ్ బాస్ 7’ 14 మంది కంటెస్టెంట్స్ పారితోషికాల లిస్ట్..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movies Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Jigarthanda Double X

Also Read

Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

Jailer 2 Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘జైలర్ 2’

Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

Ranabaali Review in Telugu: ర‌ణ‌బాలి సినిమా రివ్యూ & రేటింగ్!

Ranabaali Review in Telugu: ర‌ణ‌బాలి సినిమా రివ్యూ & రేటింగ్!

‘అఆ’ లో నాగవల్లి పాత్ర స్ఫూర్తితోనే ‘అబ్సెషన్’ తీశారేమో.. అనుపమ షాకింగ్ కామెంట్స్

‘అఆ’ లో నాగవల్లి పాత్ర స్ఫూర్తితోనే ‘అబ్సెషన్’ తీశారేమో.. అనుపమ షాకింగ్ కామెంట్స్

Jailer 2: ‘జైలర్ 2’ సినిమా థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Jailer 2: ‘జైలర్ 2’ సినిమా థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

related news

Jailer 2 Trailer Review: ‘సర్దార్ 2’ను తలపిస్తున్న ‘జైలర్ 2’ ట్రైలర్.. కానీ ఆ కేమియో ఏ స్టార్‌ది?

Jailer 2 Trailer Review: ‘సర్దార్ 2’ను తలపిస్తున్న ‘జైలర్ 2’ ట్రైలర్.. కానీ ఆ కేమియో ఏ స్టార్‌ది?

trending news

Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

9 mins ago
Jailer 2 Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘జైలర్ 2’

26 mins ago
Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

4 hours ago
Ranabaali Review in Telugu: ర‌ణ‌బాలి సినిమా రివ్యూ & రేటింగ్!

Ranabaali Review in Telugu: ర‌ణ‌బాలి సినిమా రివ్యూ & రేటింగ్!

4 hours ago
‘అఆ’ లో నాగవల్లి పాత్ర స్ఫూర్తితోనే ‘అబ్సెషన్’ తీశారేమో.. అనుపమ షాకింగ్ కామెంట్స్

‘అఆ’ లో నాగవల్లి పాత్ర స్ఫూర్తితోనే ‘అబ్సెషన్’ తీశారేమో.. అనుపమ షాకింగ్ కామెంట్స్

24 hours ago

latest news

Rajinikanth – Hrithik Roshan: అప్పుడు దత్తపుత్రుడిగా.. ఇప్పుడు అతిథిగా.. రెండూ బ్లాక్‌ బస్టర్లే

Rajinikanth – Hrithik Roshan: అప్పుడు దత్తపుత్రుడిగా.. ఇప్పుడు అతిథిగా.. రెండూ బ్లాక్‌ బస్టర్లే

3 hours ago
Maruthi: మారుతి ఫైనల్లీ బయటకు వస్తున్నారా? వారంతా నో చెప్పడంతో.. ‘కొత్త’ ఆలోచన

Maruthi: మారుతి ఫైనల్లీ బయటకు వస్తున్నారా? వారంతా నో చెప్పడంతో.. ‘కొత్త’ ఆలోచన

1 day ago
Rc17: లెక్కల మాస్టారూ హీరోయిన్‌ని కూడా ఓకే చేయించేశారా? ఓపెనింగ్‌కి తీసుకొస్తారా?

Rc17: లెక్కల మాస్టారూ హీరోయిన్‌ని కూడా ఓకే చేయించేశారా? ఓపెనింగ్‌కి తీసుకొస్తారా?

1 day ago
Jailer 2 Review in Telugu: జైలర్ 2 సినిమా రివ్యూ & రేటింగ్!

Jailer 2 Review in Telugu: జైలర్ 2 సినిమా రివ్యూ & రేటింగ్!

1 day ago
Nani Premkumar: నాని చెప్పిన ఆ ఎమోషనల్‌ లవ్‌ స్టోరీలో ఎన్టీఆర్‌ హీరోయిన్‌ నటిస్తోందా?

Nani Premkumar: నాని చెప్పిన ఆ ఎమోషనల్‌ లవ్‌ స్టోరీలో ఎన్టీఆర్‌ హీరోయిన్‌ నటిస్తోందా?

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version