ఘనంగా ఎన్టీఆర్ 40 వ పుట్టినరోజు వేడుకలు … వైరల్ అవుతున్న ఫోటోలు!

నిన్న యంగ్ టైగర్ ఎన్టీఆర్ పుట్టినరోజు. అతనికి ఇది 40 వ పుట్టినరోజు. ‘ఆర్.ఆర్.ఆర్’ తో ఎన్టీఆర్ స్టార్ ఇమేజ్ దేశాలు దాటింది. అందువల్ల ఈసారి ఎన్టీఆర్ పుట్టినరోజు నాడు.. సోషల్ మీడియాలో భారీగా బర్త్ డే విషెస్ చెప్పారు నెటిజన్లు. ఎన్టీఆర్ పుట్టిన రోజు సందర్భంగా అతని నెక్స్ట్ మూవీ ‘దేవర’ కి సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ అయ్యింది. అభిమానులకు అది ఫుల్ ఫీస్ట్ ఇచ్చిందని చెప్పాలి. అలాగే ఎన్టీఆర్ నటిస్తున్న బాలీవుడ్ ప్రాజెక్టు పై కూడా క్లారిటీ వచ్చింది. స్వయంగా హృతిక్ రోషన్.. ఎన్టీఆర్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపడంతో పాటు ‘యుద్ధభూమిలో నీ కోసం ఎదురుచూస్తుంటాను’ అంటూ ‘వార్ 2 ‘ ప్రాజెక్టు పై క్లారిటీ ఇచ్చేసాడు.

అంతేకాకుండా ‘ఎన్టీఆర్ 31 ‘ వ సినిమాగా ప్రశాంత్ నీల్ ప్రాజెక్టు ఉంటుందని ‘మైత్రి మూవీ మేకర్స్’ నిర్మాణ సంస్థ కూడా గుర్తుచేసింది. ఇక ఈ 40 వ పుట్టినరోజుని ఎన్టీఆర్.. తన ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ తో కలిసి సెలబ్రేట్ చేసుకున్నాడు.

నిన్న సాయంత్రం ఎన్టీఆర్ తన ఇంట్లో ఓ పార్టీని హోస్ట్ చేసినట్టు తెలుస్తుంది. ఈ వేడుకలో రాజమౌళి కొడుకు కార్తికేయ వంటి వారు పాల్గొన్నట్టు తెలుస్తుంది. ఈ ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి. ఇలా ఈ ఫోటోలు బయటకు వచ్చాయో లేదో .. అభిమానులు తెగ వైరల్ చేసేస్తున్నారు. మీరు కూడా ఓ లుక్కేయండి :

Read Today's Latest Movies Update. Get Filmy News LIVE Updates on FilmyFocus