Jr NTR: బాయ్‌ఫ్రెండ్‌తో కెమెరాల కంట పడ్డ జూనియర్ ఎన్టీఆర్ హీరోయిన్.. వీడియో వైరల్..!

  • April 3, 2023 / 10:20 AM IST

సెలబ్రిటీలకి సంబంధించి లవ్, ఎఫైర్, డేటింగ్, రిలేషన్ షిప్, డేటింగ్, పెళ్లి, బ్రేకప్ వంటి విషయాలు ఎప్పుడూ మీడియాతో పాటు సోషల్ మీడియాలోనూ తెగ వైరల్ అవుతుంటాయి.. ఇలాంటి వాటిలో దాదాపు స్టార్లు రియాక్ట్ అయ్యే వరకు పుకార్లు పుట్టుకొస్తూనే ఉంటాయి.. ఈమధ్య మిల్కీబ్యూటీ తమన్నా, నటుడు విజయ్ వర్మ బాగా ట్రెండ్ అయ్యారు.. కొద్ది రోజులుగా సైలెంట్ అయిపోయారు.. అయితే బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్, కొంత కాలంగా మహారాష్ట్ర మాజీ సీఎం సుశీల్ కుమార్ షిండే మనవడు శిఖర్ పహారియాతో ప్రేమలో ఉందని, డేటింగ్ చేస్తుందని బాలీవుడ్ మీడియాలో వార్తలు వస్తూనే ఉన్నాయి..

అది నిజమేనన్నట్టు వీళ్లిద్దరూ గతంలో పలు పార్టీలకు కలిసి హాజరయ్యారు.. కానీ ఇప్పటి వరకు తమ రిలేషన్ గురించి రెస్పాండ్ కాలేదు.. అయితే రీసెంట్‌గా తన ప్రియుడితో కలిసి కనిపించి వార్తల్లో నిలిచింది జాన్వీ.. బాంబేలోని కలినా ఎయిర్ పోర్టులో బాయ్‌‌ఫ్రెండ్ శిఖర్ పహారియాతో కలిసి కనిపించింది జాన్వీ కపూర్.. ఇద్దరూ వైట్ డ్రెస్ వేసుకున్నారు.. అయితే ఇద్దరూ ఎక్కడ నుండి వస్తున్నారు.. లేదా జాన్వీని రిసీవ్ చేసుకోవడానికి (కలవడానికి) అతను వచ్చాడా అనేది తెలియదు కానీ ఇద్దరూ బయటకు వస్తూ కెమెరాల కంట పడ్డారు..

దీంతో ఈ వార్త తెగ వైరల్ అవుతోంది.. జాన్నీ డేటింగ్ న్యూస్ నిజమే అంటూ బీటౌన్ వర్గాల్లో కొత్త మాటలు వినిపిస్తున్నాయి.. ఇక జాన్వీ కపూర్ చాలా సంవత్సరాల ఎదురు చూపుల తర్వాత జూనియర్ ఎన్టీఆర్ నటిస్తున్న 30వ సినిమాతో గ్రాండ్ టాలీవుడ్ ఎంట్రీ ఇస్తుంది.. కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా పూజా కార్యక్రమంలో జాన్వీ చీరకట్టులో మెరిసిపోయింది..

అమ్మడు (Jr NTR) తారక్ పక్కన నిలబడితే పెయిర్ కిరాక్ ఉంది అంటూ ఫ్యాన్స్ సంబరపడుతున్నారు.. ఇటీవలే రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ అయింది.. వచ్చే ఏడాది ఏప్రిల్ 5న NTR 30 పాన్ ఇండియా మూవీగా భారీ స్థాయిలో రిలీజ్ కానుంది..

హీలీవుడ్‌లో నటించిన 15 మంది ఇండియన్ యాక్టర్స్ వీళ్లే..!
టాలీవుడ్‌లో గుర్తింపు తెచ్చుకున్న 10 మంది కోలీవుడ్ డైరెక్టర్స్ వీళ్లే..!

తు..తు…ఇలా చూడలేకపోతున్నాం అంటూ…బాడీ షేమింగ్ ఎదురుకున్న హీరోయిన్లు వీళ్ళే
నాగ శౌర్య నటించిన గత 10 సినిమాల బాక్సాఫీస్ పెర్ఫార్మన్స్ ఎలా ఉందంటే?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus