లండన్‌లోని ప్రతిష్టాత్మక రాయల్ ఆల్బర్ట్ హాల్‌లో ‘ఆర్ఆర్ఆర్’ (RRR) సినిమా మ్యూజిక్ కాన్సర్ట్ అట్టహాసంగా జరిగింది. ఈ ఈవెంట్‌లో దర్శకుడు ఎస్.ఎస్. రాజమౌళి, హీరోలు జూనియర్ ఎన్టీఆర్ (Jr NTR), రామ్ చరణ్, సంగీత దర్శకుడు ఎం.ఎం. కీరవాణి పాల్గొన్నారు. రాయల్ ఫిల్‌హార్మోనిక్ ఆర్కెస్ట్రా సమక్షంలో కీరవాణి సంగీతం ఆలపించగా, సినిమాను ప్రత్యక్షంగా చూసిన ప్రేక్షకులు ఉత్సాహంతో ఊగిపోయారు.
‘నాటు నాటు’ పాట ఆస్కార్ గెలుచుకున్న సందర్భాన్ని పురస్కరించుకుని జరిగిన ఈ కార్యక్రమం, తెలుగు సినిమా ఔన్నత్యాన్ని మరోసారి ప్రపంచానికి చాటింది. స్టేజిపై ఎన్టీఆర్ (Jr NTR), రామ్ చరణ్ మధ్య స్నేహపూరిత క్షణాలు అభిమానులకు కనువిందుగా నిలిచాయి. మే 20న ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా, రామ్ చరణ్ ముందస్తు శుభాకాంక్షలు చెబుతూ, ఆప్యాయంగా హత్తుకుని, చెంపపై ముద్దు పెట్టాడు.
ఈ ఆత్మీయ క్షణం ప్రేక్షకుల నుంచి జోరైన చప్పట్లను అందుకుంది. సోషల్ మీడియాలో ఈ దృశ్యాలు వైరల్ అయ్యాయి. ఈ ఈవెంట్‌కు మహేష్ బాబు కూడా హాజరవుతాడని అంచనాలు ఉన్నప్పటికీ, ఆయన రాలేదు, అయినప్పటికీ ఈ కార్యక్రమం ఘనంగా జరిగింది. అయితే, ఈ సంతోషకరమైన వాతావరణంలో ఒక చిన్న ఘటన ఎన్టీఆర్‌ను అసహనానికి గురి చేసింది. కాన్సర్ట్ అనంతరం ఎన్టీఆర్ హాలు నుంచి బయటకు వెళ్తుండగా, అభిమానులు సెల్ఫీల కోసం ఒక్కసారిగా ఆయన చుట్టూ చేరారు.
ఈ క్రమంలో గుంపు అదుపు తప్పడంతో, సాధారణంగా ప్రశాంతంగా ఉండే ఎన్టీఆర్ (Jr NTR) కాస్త కోపంగా స్పందించాడు. “సెల్ఫీ ఇస్తాను, కానీ కాస్త ఓపిక పట్టండి. ఇలా చేస్తే సెక్యూరిటీ మిమ్మల్ని బయటకు పంపేస్తుంది” అని హెచ్చరించాడు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఈ సంఘటనపై నెటిజన్లు రెండు రకాలుగా స్పందిస్తున్నారు. కొందరు అభిమానులు తమ ప్రేమతో ఎన్టీఆర్‌ను కలవాలని ఆరాటపడ్డారని, అందుకే ఇలా జరిగిందని అంటున్నారు. మరికొందరు మాత్రం, అభిమానం పేరుతో హీరోలకు ఇబ్బంది కలిగించడం సరికాదని, ప్రతి ఒక్కరూ భద్రతా నిబంధనలను పాటించాలని సూచిస్తున్నారు.
#JrNTR with fans at the #RRR Live Concert held at Royal Albert Hall. pic.twitter.com/R4xsZjTEOJ
— Filmy Focus (@FilmyFocus) May 12, 2025